దేశంలో టీవీల ధరలకు మరోసారి రెక్కలు రానున్నాయి. సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కావడంతో ఏప్రిల్ నెలలో వీటి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే, టెలివిజన్ స్క్రీన్ల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని కేంద్రం భావిస్తుండటంతో వీటి ధరలు మరోసారి 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశం ఉంది. టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతుంటాయి. దేశీయంగా ఎక్కువ విక్రయాలు జరిపే ప్రధాన బ్రాండ్లయిన శామ్సంగ్, ఎల్జీ, సోనీ, పానసోనిక్, హైయర్, థామ్సన్, కొడాక్, ఎంఐ, వన్‌ప్లస్ కంపెనీలు చైనా నుంచే ఓపెన్ సెల్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటాయి. దీంతో వీటిపై కస్టమ్ డ్యూటీ పెరిగితే ధరలు కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది.
ధరల పెంపుపై పానాసోనిక్ ఇండియా సౌత్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ మనీష్ శర్మ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ముడిసరుకు, రవాణా ఖర్చులకు అనుగుణంగా 3–4 శాతం మేర టీవీ ధరలను పెంచాలని యోచిస్తున్నాం.” అని అన్నారు. ఇక, మరో టెలివిజన్ కంపెనీ హైయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రాగన్జా మాట్లాడుతూ ‘‘ముడి సరుకు, రవాణా ఛార్జీలు పెరగడంతో మా ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు. అందువల్లే, మా కంపెనీ టీవీలపై 3 నుంచి 4 శాతం ధరలను పెంచబోతున్నాం. ఈ కొత్త ధరలు జూన్ 20 నుండి అమల్లోకి వస్తాయి” అని అన్నారు. ఇక, ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, అమెరికాకు చెందిన కొడాక్ బ్రాండ్ కూడా రాబోయే రోజుల్లో తమ టీవీలపై రూ .1,000 నుంచి 2,000 వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.
WhatsApp: బీ రెడీ... వాట్సప్‌లో రాబోతున్న 5 కొత్త ఫీచర్స్ ఇవే
PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింకింగ్‌కు 2 వారాలే గడువు... చేయకపోతే ఈ చిక్కులు తప్పవు
కాగా, టీవీ రేట్లు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కానుంది. ప్యానెళ్ల రేట్లు పెరుగుతాయనే కారణంతో జనవరి, ఏప్రిల్‌లో టీవీల ధరలను కంపెనీలు పెంచాయి. అయితే, కేంద్రం కస్టమ్ డ్యూటీ పెంచాలని యోచిస్తుండటంతో మరోసారి వీటి ధరలు పెరగనున్నాయి. కాగా, టెలివిజన్ తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్ ఒక ముఖ్యమైన భాగం. టెలివిజన్ మొత్తం ధరలో ఇదే 70 శాతం వరకు ఉంటుంది. తయారీదారులు ఈ ప్యానెళ్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటారు. కొన్ని కంపెనీలు మాత్రం తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం, చైనాలోని షెన్‌జెన్ నుండి న్వా షెవా వరకు సముద్ర మార్గం ద్వారా వీటిని తరలించేందుకు ఒక కంటైనర్‌కు 4,200 డాలర్ల ఖర్చవుతుంది.
Online Gold: ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు ఈ 9 టిప్స్ గుర్తుంచుకోండి
SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్
అయితే, ఏడాదిన్నర క్రితం ఈ ఖర్చు కేవలం 600 డాలర్లు మాత్రమే ఉండేది. ఫలితంగా, గతేడాది జూన్ నుండి ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 300 నుంచి -400 శాతం పెరిగాయి. కస్టమ్ డ్యూటీ పెరుగుతుండటంతో మరోసారి ధరలు పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. కాగా, భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో టెలివిజన్ది అతి పెద్ద వాటా. వీటి మార్కెట్ వాల్యూ దాదాపు రూ .25,000 కోట్లకు పైమాటే.2018–19లో 175 లక్షల యూనిట్లుగా ఉన్న భారతీయ టెలివిజన్ మార్కెట్ 2024–25లో 284 లక్షల యూనిట్లకు పెరుగుతుందని అంచనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android TV, MI LED TV, Smart TV