Home /News /technology /

TELEGRAM WILL BRINGS NEW FEATURE SCHEDULE VOICE CHAT SOON HERE FULL DETAILS NS GH

Telegram New feature: టెలిగ్రామ్ యాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గోప్యంగా ఉండే మెసేజ్‌లు చేసుకోగ‌లిగిన టెలిగ్రామ్ యాప్ ఇప్పుడు ఇండియాలో చాలా వేగంగా వినియోగ‌దారుల‌కు చేరువ‌వుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగానూ టెలిగ్రామ్‌ కు డిమాండ్ పెరుగుతోంది. అందుకే వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ కావ‌డం కోసం యాప్ డెవల‌ప‌ర్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
వాట్సాప్ ఇటీవ‌ల తీసుకొచ్చిన కొత్త పాల‌సీ వ‌ల్ల ఆ యాప్‌కి వినియోగ‌దారులు దూర‌మ‌వుతున్నారు. ఇదే స‌మ‌యంలో టెలిగ్రామ్ యాప్‌కి తాకిడి పెరిగింది. రోజురోజుకీ ఎక్కువ‌వుతున్న వినియోగ‌దారులను మెప్పించ‌డానికి టెలిగ్రామ్ కొత్త ఫీచ‌ర్లను తీసుకువచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సాధారణంగా ఎవరైనా త‌మ వ్య‌క్తిగత విష‌యాల‌ను గోప్యంగానే ఉంచుకోవాడానికే మొగ్గుచూప‌డం స‌హ‌జం. అలాంటిది వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త‌ పాల‌సీ దీనికి వ్య‌తిరేకంగా ఉండ‌టంతో ప్ర‌జ‌ల్లోనూ ఆ యాప్‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యామ్నాయ యాప్‌లు వెదుకుతున్నారు. మిలియ‌న్ల‌ కొద్దీ జ‌నం సెక్యూరిటీ ఎక్కువ‌గా ఉండే చాటింగ్ వేదిక‌‌లకు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ యాప్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గోప్యంగా ఉండే మెసేజ్‌లు చేసుకోగ‌లిగిన టెలిగ్రామ్ యాప్ ఇప్పుడు ఇండియాలో చాలా వేగంగా వినియోగ‌దారుల‌కు చేరువ‌వుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగానూ టెలిగ్రామ్‌ కు డిమాండ్ పెరుగుతోంది.


అందుకే వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ కావ‌డం కోసం యాప్ డెవల‌ప‌ర్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో, ఆప్‌డేట్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దార్ల డిమాండ్లు తీర్చే ప‌నిలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెల‌లో టెలిగ్రామ్ ఒక ముఖ్య‌మైన అప్‌డేట్ చేసింది. ఛాన‌ల్స్‌లో వాయిస్ చాట్ స‌పోర్టును యాడ్ చేసింది. వాయిస్ చాట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని మ‌రింత మెరుగుప‌ర‌చ‌డం కోసం ఈ ఫీచ‌ర్‌లో మ‌రిన్ని అప్‌డేట్‌లు కూడా చేసింది. ఇప్పుడు దీన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డం కోసం బీటా చాన‌ల్ పైన‌ మ‌రో అప్‌డేట్‌ను చేర్చింది. దీనితో ఈ కొత్త ఫీచ‌ర్ మ‌రింత విస్తృతమ‌వుతుంది.





ఇటీవ‌లి టెస్టింగ్‌ క్యాట్‌లాగ్ రిపోర్టు ప్ర‌కారం, బీటా ఛాన‌ల్‌పై టెలిగ్రామ్ వి7.7.0 రావ‌డం మొద‌ల‌య్యింది. ఇది వాయిస్ చాట్‌ల‌ల్లో కొత్త షెడ్యు‌లింగ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచ‌ర్ పైన అంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాన్నే ఎక్స్‌డిఏ డెవ‌ల‌ప‌ర్లు వివరిస్తూ ఛాన‌ల్ అడ్మిన్‌లు ఇకపై వాయిస్ చాట్‌ని షెడ్యుల్ చేయ‌గ‌ల‌ర‌ని అన్నారు. ఈ వాయిస్ చాట్ ‌ను షెడ్యుల్ చేయ‌డం కోసం, అడ్మిన్‌లు చానల్ ఐకాన్‌పైన‌, అలాగే త్రీ-డాట్ సెట్టింగ్స్‌పైన ట్యాప్ చేయాలి. `స్టార్ట్ వాయిస్ చాట్‌` ఆప్ష‌న్‌ను సెలక్ట్ చేసుకోని, త‌ర్వాత కొత్త `షెడ్యుల్ వాయిస్ చాట్‌` ఆప్ష‌న్‌పైన ట్యాప్ చేయాలి.

అప్పుడు అడ్మిన్లు తేదీని, స‌మ‌యాన్ని ఎంచుకోవ‌చ్చు. త‌ర్వాత వాయిస్ చాట్ షెడ్యుల్ చేసుకోవ‌డం కోసం కిందున్న బ‌ట‌న్‌పై ట్యాప్ చేయాలి. రిపోర్టు ప్ర‌కారం, స‌భ్యులంద‌రికీ కౌంట్‌డౌన్‌తో స‌హా షెడ్యుల్ వాయిస్ చాట్ నోటిఫికేన్ చాన‌ల్ పై భాగంలో క‌నిపిస్తుంది. కొత్త‌గా వ‌చ్చిన ఈ షెడ్యులింగ్ ఫీచ‌ర్ హ్యాండీ ఎడిష‌న్‌గా ఉంటుంది. ఇది టెలిగ్రామ్ వాయిస్ చాట్‌‌ని క్ల‌బ్‌హౌస్‌కు అనుకూల ప్ర‌త్యామ్నాయంగా మార్చుతుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Telegram, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు