• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • TELEGRAM ROLLS OUT NEW FEATURES HERE IS THE FULL DETAILS SU GH

Telegram: టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్లు.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి..

Telegram: టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్లు.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ వివాదాస్పద ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టడంతో యూజర్లు టెలిగ్రామ్​ యాప్​ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

  • Share this:
ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ వివాదాస్పద ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టడంతో యూజర్లు టెలిగ్రామ్​ యాప్​ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి నెలలో గూగుల్ ప్లే స్టోర్​లో అత్యధికంగా డౌన్​లోడ్​ అయిన యాప్​గా టెలిగ్రామ్ నిలిచి.. ​ సరికొత్త రికార్డు సృష్టించింది. వాట్సాప్​ను వెనక్కి నెట్టేసి మరీ అత్యధిక డౌన్ లోడ్స్​ను సాధించింది. ఇక, ఇదే జోరు కొనసాగించేందుకు టెలిగ్రామ్​ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. నూతన ఫీచర్లలో భాగంగా ఆటో డిలీట్​, ఇన్వైట్ లింక్స్ ఎక్స్​పైర్​, నూతన ఎమోజీలు, చాట్ ఇంపోర్ట్స్​, రిపోర్టింగ్ సిస్టమ్‌ వంటి కొత్త ఫీచర్లను జోడించింది. ఈ నూతన ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

ఆటో-డిలీట్ ఫీచర్​: టెలిగ్రామ్​లో కొత్తగా చేర్చిన ‘ఆటో డిలీట్’​ ఫీచర్ ద్వారా మనకు వచ్చిన మెసేజ్​లను నిర్థేశించిన సమయం తర్వాత ఆటోమేటిక్​గా తొలగించవచ్చు. దీన్ని అన్ని ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ రెండు డివైజెస్​లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఇంతకుముందు సీక్రెట్​ చాట్స్​లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, ప్రస్తుతం అన్ని సాధారణ చాట్​లకు కూడా వర్తింపజేసింది. ఇందులో భాగంగా అవతలి వారు మనకు పంపిన మెసేజెస్​ను ఆటోమేటిక్​గా డిలీట్ చేయడానికి 24 గంటల నుండి 7 రోజుల టైం లిమిట్​ను సెట్​ చేసుకోవచ్చు. దీని ద్వారా స్టోరేజ్​ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

ఇన్వైట్​ లింక్స్​ ఎక్స్​పైర్: ​దీని కింద వినియోగదారులు పరిమిత టైం లిమిట్​ పెట్టుకొని ఒకేసారి ఇన్వైట్​ లింక్‌లను అవతలి వారికి పంపవచ్చు. అదనంగా, ఇన్వైట్​ లింక్‌లను పంపడానికి QR కోడ్‌ను కూడా క్రియేట్​ చేయవచ్చు. ఈ ఇన్వైట్​ లింక్‌ల ద్వారా ఎవరెవరు గ్రూప్​లో చేరారో కూడా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రూప్​లో చేరిన కొత్త మెంబర్స్ ​గురించి సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం టెలిగ్రామ్​ గ్రూప్స్​లో 200,000 మంది మెంబర్స్​ చేరడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అపరిమిత సభ్యులను అనుమతించే బ్రాడ్‌కాస్ట్ గ్రూపులను కూడా క్రియేట్​ చేసే ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని ఎమోజీలు: నూతన అప్​డేట్​లో భాగంగా కొత్త ఎమోజీలను చేర్చింది. చాట్ ఇంపోర్ట్స్​, రిపోర్టింగ్ ​మనకు వచ్చిన మెసేజెస్​లో నుంచి కొన్ని ఇంపార్టెంట్​ మెసేజెస్​ను ఒక ప్రత్యేక చాట్​ గ్రూప్​లో యాడ్​ చేయడం ద్వారా.. ఆయా మెసేజెస్​ను వచ్చిన అసలు తేదీల ప్రకారం వాటిని ఆటోమేటిక్​గా క్రమబద్ధీకరించవచ్చు. ఇక రిపోర్టింగ్ ఫీచర్​ విషయానికొస్తే, వినియోగదారుడు నిర్దిష్ట సందేశాలను ఎంచుకొని రిపోర్ట్​ను పంపవచ్చు.
Published by:Sumanth Kanukula
First published: