Home /News /technology /

TELEGRAM ADDING NEW FEATURES TO APP INCLUDING GROUP VIDEO CALL AND SCREEN SHARING SS GH

Telegram New Features: వాట్సాప్​కు ధీటుగా టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్స్

Telegram: వాట్సాప్​కు ధీటుగా టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Telegram: వాట్సాప్​కు ధీటుగా టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Telegram New Features | వాట్సప్‌కు టెలిగ్రామ్ గట్టి పోటీ ఇస్తోంది. డౌన్‌లోడ్స్‌లో వాట్సప్‌ను మించిపోతోంది. ఇప్పుడు టెలిగ్రామ్ మరిన్ని కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసింది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రత్యేకమైన సదుపాయాలతో వినియోగదారులను పెంచుకుంటున్న ఈ యాప్​కు మరిన్ని ఫీచర్లు యాడ్ అయ్యాయి. దీంతో వాట్సాప్​కు గట్టిపోటీగా నిలవచ్చని టెలిగ్రామ్ భావిస్తోంది. ముఖ్యంగా ఇంతకాలం లేని గ్రూప్ వీడియో కాల్స్ ఆప్షన్​ను టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆన్​లైన్ క్లాసులకు, వ్యాపార సమావేశాలకు, మీటింగ్​లకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కొత్తగా యానిమేటెడ్​ ఎమోజీలు, థర్డ్​పార్టీ స్టిక్కర్లను ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కూడా వచ్చింది. అలాగే స్క్రీన్ షేరింగ్​, నాయిస్ సస్పెన్షన్​, యానిమేటెడ్ బ్యాంక్​గ్రౌండ్​ లాంటి సూపర్ ఫీచర్లను టెలిగ్రామ్ ప్రవేశపెట్టింది.

ఏదైనా గ్రూప్​లో యాక్టివ్​ సెషన్​లో ఉన్నప్పుడు ‘షేర్ మై వీడియో’ అనే ఆప్షన్​ను క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్​లో గ్రూప్​ వీడియోకాల్స్ చేయవచ్చు. ప్రస్తుతానికి వాయిస్ చాట్​లో యాడ్ అయిన మొదటి 30 మంది వీడియో కాల్​లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పరిమితిని త్వరలోనే పెంచుతామని టెలిగ్రామ్ ప్రకటించింది. అలాగే గేమ్స్ స్ట్రీమింగ్​, లైవ్ ఈవెంట్స్​తో పాటు మరిన్ని సదుపాయలు తీసుకొస్తామని చెప్పింది.

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్... డిస్కౌంట్ వివరాలు ఇవే

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్

మరోవైపు ఈ వీడియో కాల్​లో స్క్రీన్​ షేరింగ్ ఫీచర్​ను కూడా టెలిగ్రామ్ తీసుకొచ్చింది. దీంతో వీడియో కాల్​లో ఉన్న వారు వారి స్క్రీన్ వేరే వారికి ప్రజెంట్ చేయవచ్చు. అలాగే డెస్క్​టాప్​లో వాయిస్ చాట్​కు ఓ సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. దీంతో ఏదీ మినిమైజ్ చేయకుండా యూజర్లు మాట్లాడుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు.

అలాగే టెలిగ్రామ్​ యానిమేటెడ్ బ్యాక్​గ్రౌండ్​ను ప్రవేశపెట్టింది. మెసేజ్ పంపినప్పుడు ఆల్గారిథమ్​లతో డిజైన్ చేసిన రంగురంగుల వాల్​పేపర్​ యాడ్​అయి మెసేజ్ ఆకర్షణీయంగా తయారవుతుందని చెప్పింది. ప్రీఇన్​స్టాల్ థీమ్​తోనే ఈ ఫీచర్​ను ఇస్తోంది. టెలిగ్రామ్ ఆండ్రాయిడ్ యాప్​లో చాట్ సెట్టింగ్​లోకి వెళ్లి చేంజ్ చాట్ బ్యాంక్​గ్రౌండ్​లో ఈ ఫీచర్​ను పొందవచ్చు. అదే ఐఓఎస్​లో అయి అప్పీయరెన్స్​ అనే ఆప్షన్​లో ఉంటుంది. అలాగే యూజర్లు కూడా తమకు నచ్చిన రంగుల్లో, ప్యాటర్న్​లలో బ్యాక్​గ్రౌండ్​లు క్రియేట్ చేసుకోవచ్చు.

Jio Recharge via WhatsApp: జియో సిమ్ రీఛార్జ్ చేయాలా? వాట్సప్‌లో చేయండిలా

Airtel Rs 456 Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.456 ప్లాన్ ప్రకటించిన కంపెనీ

ఇక కీబోర్డ్ ద్వారానే స్టిక్కర్లు, ఎమోజీలను పంపేలా టెలిగ్రామ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ లైట్​వైట్ యానినేషన్ల వల్ల బ్యాటరీపైన కూడా పెద్దగా ప్రభావం పడదు. స్టిక్కర్లను సొంతంగా తయారు చేసుకునేందుకు డెవలపర్లకు స్టిక్కర్ బోట్​ ఆప్షన్​ కూడా అందుబాటులోకి వచ్చింది. థర్డ్​పార్టీ డెవలపర్లు ఈ టూల్​ను ఉపయోగించి ప్రత్యేకమైన స్టిక్కర్లను తయారు చేయడంతో పాటు ఇంపోర్ట్​ చేసేందుకు కూడా టెలిగ్రామ్ ఫీచర్ తీసుకొచ్చింది. లాగిన్​ వివరాలను నోటిఫికేషన్ ద్వారా పంపే ఫీచర్​ను తర్వాతి ఆప్​డేట్​లో తీసుకొస్తామని సంస్థ తెలిపింది. టూ స్పెప్ వెరిఫికేషన్​ను మార్చుకున్న ప్రతీసారి అన్ని ఫ్లాట్​ఫామ్​ల యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Telegram

తదుపరి వార్తలు