ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్ల (Smart Phones) వాడకం పెరుగుతున్నా కొద్దీ.. సైబర్ నేరాలు (Cyber Frauds) సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు (Police) సైతం సైబర్ నేరాలు పెరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకునే చర్యల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ వారిని చైతన్యం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నా.. నిత్యం ఎక్కడో చోట ప్రజలు సైబర్ నేరాలకు గురి అవుతూనే ఉన్నారు. సైబర్ కేటుగాళ్లు సైతం ఎప్పటికప్పుడూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ 9 జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ 9 జాగ్రత్తలివే..
1. లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
2.కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
4.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు. SBI Alert: మీరు ఎస్బీఐ కస్టమరా? ఈ గైడ్లైన్స్ మీకోసమే
6.OLX, 99acres, Magicbricks లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
7. ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
8. పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.