TELANGANA POLICE DEPARTMENT WARNS ABOUT FAKE LOAN APPS KNOW HOW TO BE SAFE SS
Fake Loan Apps: ఈ 137 లోన్ యాప్స్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న తెలంగాణ పోలీసులు
Fake Loan Apps: ఈ 137 లోన్ యాప్స్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న తెలంగాణ పోలీసులు
(ప్రతీకాత్మక చిత్రం)
Fake Loan Apps | లోన్ తీసుకోవడానికి గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించే యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఇలాంటి లోన్ యాప్స్ (Loan Apps) విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పోలీసులు.
గతంలో లోన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేయాల్సి వచ్చేది. బ్యాంకులో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ పూర్తై పర్సనల్ లోన్ (Personal Loan) అకౌంట్లోకి వచ్చేసరికి ఒకట్రెండు వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని డాక్యుమెంట్స్ ఉంటే 10 నిమిషాల్లో లక్షల రూపాయల లోన్ కూడా తీసుకోవచ్చు. ఇక ఇటీవల లోన్ యాప్స్ (Loan Apps) ట్రెండ్ అవుతున్నాయి. రుణాలు ఇచ్చేందుకు అనేక కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వివరాలు ఎంటర్ చేయడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, వెరిఫికేషన్ పూర్తి చేయడం... అంతే లోన్ మంజూరవుతుంది.
అయితే ఈ లోన్ యాప్స్ అనేక దారుణాలకు కూడా కారణం అవుతున్నాయి. లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకున్నవారికి వేధింపులు ఎదురవుతున్నాయి. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకుంటే ఆ స్మార్ట్ఫోన్లలోని కాంటాక్ట్స్ అన్నీ యాప్ నిర్వహించేవారికి వెళ్తాయి. రుణం తీసుకున్నవారు ఈఎంఐ చెల్లించడంలో విఫలం అయితే ఇక వేధింపులు మొదలవుతాయి. లోన్ తీసుకున్నవారిని వేధించడంతో పాటు, వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి చెబుతామని, పరువు తీస్తామని బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నవారున్నారు.
ఇలాంటి ఘటనలు అన్నింటికీ కారణం నకిలీ లోన్ యాప్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతులు లేకుండా లోన్ యాప్స్ నిర్వహిస్తున్నవారు రుణగ్రహీతల్ని వేధిస్తున్నట్టు అనేక కేసుల్లో తేలింది. దీంతో ఆర్బీఐ అనేక చట్టవిరుద్ధమైన లెండింగ్ యాప్స్‌ని గుర్తించింది. తెలంగాణ పోలీసులు కూడా ఈ నకిలీ యాప్స్ విషయంలో హెచ్చరిస్తున్నారు. 137 యాప్స్ జాబితా విడుదల చేసిన తెలంగాణ పోలీసులు, ఫేక్ లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Beware of #FakeLoanApps.
Many Apps offer loans over phone.People who are in need will accept by allowing permissions to access their contacts.They'll charge high rate of interests.If any failed to repay/delayed, they start harassment by contacting/messaging to all their contacts. pic.twitter.com/CjLwwXDSWz
— Telangana State Police (@TelanganaCOPs) April 23, 2022
గూగుల్ ప్లేస్టోర్‌లో వందలాది లోన్ యాప్స్ కనిపిస్తాయి. అందులో ఆర్బీఐ అనుమతులు ఉన్న యాప్స్ కొన్ని మాత్రమే. మిగతావన్నీ నకిలీ లోన్ యాప్స్. ఇలాంటివాటిలో రుణాలు తీసుకోవడం రిస్కే. అధిక వడ్డీలు వసూలు చేయడం, ఈఎంఐ చెల్లించని వారిని వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటి రిస్కులన్నీ ఉన్నాయి. కాబట్టి రుణాలు తీసుకునే విషయంలో బ్యాంకుల్ని, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల్ని ఆశ్రయించడమే మంచిది.
లోన్ యాప్స్ చాలావరకు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొనే రుణాలు ఇస్తుంటాయి. వీటిలో క్రెడిట్ లైన్ లోన్స్ కూడా ఉంటాయి. పర్సనల్ లోన్ తీసుకుంటే మొత్తం మీ అకౌంట్లో జమ అవుతుంది. ఆ మొత్తానికి మీరు ఈఎంఐ చెల్లించాలి. కానీ క్రెడిట్ లైన్ రుణాల్లో మీకు రూ.5,00,000 లోన్ మంజూరైతే మీరు ఎంత మొత్తం వాడుకుంటే అంత మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. అంటే మీరు రూ.2,00,000 మాత్రమే వాడుకుంటే అంతమొత్తానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.