Home /News /technology /

TELANGANA POLICE CREATING AWARENESS IN PEOPLE ABOUT LOAN APPS WITH POPULAR MOVIE DIALOGUES NS

TS Police - Loan Apps: లోన్ యాప్స్ పై రంగంలోకి దిగిన హీరోలు మహేష్, ఎన్టీఆర్, బన్నీ.. వాళ్లేం చెప్పారో మీరే చూడండి

మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్ (ఫైల్ ఫొటోలు)

మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్ (ఫైల్ ఫొటోలు)

ప్రమాదకర యాప్ ల ద్వారా లోన్లు తీసుకుని ఇబ్బంది పడకండి అంటూ పోలీసులు సోషల్ మీడియా (Social Media) ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ హీరోలను సైతం వాడుకుంటున్నారు.

    తెలంగాణ పోలీసులు (Telangana Police) కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ ప్రమాదకర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందు ఉంటున్నారు. ఇందు కోసం సోషల్ మీడియా (Social Media) ను విస్తృతంగా వినియోగించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సైబర్ నేరాలు (Cyber Crime), ఆన్లైన్ మోసాలపై సోషల్ మీడియా వేధికగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇలీవల పెరిగిపోయిన ముఖ్యమైన సమస్య లోన్ యాప్స్. లోన్ యాప్స్ బారిన పడి.. వారు వేసే అప్పులు కట్టలేక ప్రాణాలు తీసుకున్న వారు సైతం ఉన్నారు. అయితే ఇలాంటి ప్రమాదకర యాప్ ల ద్వారా లోన్లు తీసుకుని ఇబ్బంది పడకండి అంటూ పోలీసులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

    ఇందు కోసం హిట్ సినిమాల్లో ప్రజల్లోకి బాగా వెళ్లిన డైలాగ్ లు, పోస్టర్లను సైతం వాడుకుంటున్నారు. ముఖ్యంగా పుష్ప, సర్కారు వారి పాట, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని డైలాగ్ లతో పోస్టర్లను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు పోలీసులు. దీంతో ఆ పోస్టర్లు ఆకట్టుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.
    Cyber Frauds: యాప్స్ వాడే వారికి అలర్ట్.. ఈ జాగ్రత్త తప్పక పాటించాలన్న పోలీసులు







    ఈ పోస్టులకు అనేక మంది బాధితులు సైతం తమ కామెంట్ల ద్వారా తమ ఆవేదనను, జరిగిన నష్టాన్ని పంచుకుంటున్నారు. తాము తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ చెల్లించాలని వేధిస్తున్నారని వాపోతున్నారు. దీనికి పోలీసులు సైతం స్పందిస్తున్నారు. వారు పంపించే మెసేజ్ లను పట్టించుకోకుండా స్థానిక పోలీస్ స్టేషన్లలో కంప్లెయింట్ చేయాలని సూచిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Loan apps, Telangana Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు