TELANGANA NEWS ELECTRIC BIKE CATCHES FIRE IN NIRMAL DISTRICT HERE DETAILS NS
Electric Bike Fire: తెలంగాణలో కాలి బూడిదైన ఎలక్ట్రిక్ బైక్.. పార్కింగ్ చేసిన కొద్ద సేపటికే చెలరేగిన మంటలు.. ఎక్కడంటే?
బైక్ మంటలను ఆర్పుతున్న స్థానికులు
మరో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగడంతో కొద్ది సేపట్లోనే కాలి బూడిదైంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మరో ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) లో మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల వ్యవధిలో ఆ బైక్ సగానికి పైగా కాలిపోయింది. ఈ ఘటన తెలంగాణ (Telangana) రాష్ట్రం లోని నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఉన్న బైక్ లో నుంచి ఒక్క సారిగా మంటలు రావడంతో స్థానికులంతా షాక్ కు గురయ్యారు. దీంతో కొద్ది సేపటి వరకు ఏం జరుగుతుంతో తెలియని పరిస్థితి. అంతా తేరుకునే లోపే బైక్ దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ అహాద్ రాత్రి విందు కార్యక్రమం ముగించుకుని తన ఎలక్ట్రిక్ బైకు పై తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఇంటి ముందు బైక్ ను పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయాడు. అయితే.. నిమిషాల వ్యవధిలోనే బైక్ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ఈ లోగానే బైక్ లో దాదాపు 70-80 శాతం కాలిపోయింది.
అయితే.. ఆ బైక్ ఏ కంపెనీకి చెందిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో పలు చోట్ల వాహనాల్లో నుంచి మంటలు వస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుకు గతంలో ఆసక్తి చూపిన వారు మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.