Home /News /technology /

TELANGANA MINISTER KTR CALLS FOR GREATER TRANSPARENCY IN GOVTS USE OF FACIAL TECHNOLOGY KTR SPOKE ON ARTIFICIAL INTELLIGENCE GH VB

KTR | WEF: ఆ టెక్నాలజీ వినియోగంలో పారదర్శకత అవసరం.. దానిపై ప్రజలకు భరోసా కల్పించాలన్న కేటీఆర్..

మాట్లాడుతున్న కేటీఆర్

మాట్లాడుతున్న కేటీఆర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చైన్‌, డేటా సైన్సెస్‌ వంటి సాంకేతికతల వినియోగంతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence), మెషీన్‌ లెర్నింగ్‌(Machine Learning), బ్లాక్‌ చైన్‌(Black Chain), డేటా సైన్సెస్‌(Data Sciences) వంటి సాంకేతికతల వినియోగంతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. ఈ సరికొత్త టెక్నాలజీలను(New Technology) రెండు వైపులా పదును ఉన్న కత్తితో పోల్చారు. దావోస్‌లో(Davos) జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(World Economic Forum) సదస్సులో భాగంగా ‘కృత్రిమ మేధ వినియోగం.. ప్రజల విశ్వాసం’ (AI ఆన్ ది స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్) అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు.
ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి టెక్నాలజీల వినియోగంలో ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్‌ అని కేటీఆర్ అన్నారు. డేటా భద్రత, వినియోగంలో పారదర్శకత పాటించాలన్నారు. అనుమతి లేకుండా ఈ టెక్నాలజీని నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబోమన్న భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

ఈ టెక్నాలజీ వినియోగంపై నియంత్రణ అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. పారదర్శకంగా ఈ అధికారాలను ప్రభుత్వ విభాగాలకు కల్పించాల్సిన బాధ్యత పార్లమెంటరీ వ్యవస్థపై ఉందన్నారు.
ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వినియోగంతో నేరస్థులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం కోసం ఇతర వ్యక్తులపై ఆధారపడే అవసరం పోలీసులకు క్రమంగా తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీని సరైన విధానంలో వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతాయన్నారు.

ఫేషియల్ రికగ్నిషన్‌- సవాళ్లు
ఇటీవల కాలంలో చాలా మంది ఫేషియల్ రికగ్నిషన్‌ కచ్చితత్వంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచార భద్రత, నిర్వహణ విషయంలో పారదర్శకత లేకపోవడమనేది సర్వసాధారణమైన సామాజిక ఆందోళనలలో ఒకటి. అలాగే నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం, పౌరుల అనుమతి లేకుండా వారి ఫోటోలను ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా తీసుకోవడం కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం అవుతుంది.

Flipkart Updates: ఫ్లిప్‌కార్ట్‌ వినియోదారులకు గుడ్ న్యూస్.. యాప్ లో అందుబాటులోకి రెండు కొత్త ఫీచర్స్..


ఫేషియల్ రికగ్నిషన్, డేటా అనలిటిక్స్ ద్వారా సామూహిక పర్యవేక్షణకు దారి తీస్తుందని, ఇది పౌరుల స్వేచ్ఛ, గోప్యత హక్కులకు భంగం కల్గించడమేనని మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా కాలంగా వినియోగిస్తున్నారు. వీధి కెమెరాలు మొదలుకుని, బయోమెట్రిక్ ప్రామాణీకరణ అవసరమయ్యే యాప్‌ల వరకు ఆ దేశంలో ఈ సాంకేతికత వినియోగం పెరుగుతోంది. అయితే పబ్లిక్ డొమైన్‌లో దీన్ని ఉపయోగించడంపై చైనా పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది.

గోప్యత, నైతిక విలువల దుర్వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా 2020లో ఐరోపా కమిషన్ పబ్లిక్ ప్లేస్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను ఐదేళ్ల వరకు నిషేధించిన సంగతి తెలిసిందే. ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU) ఈ సాంకేతికత నైతిక వినియోగాన్ని నిర్ధారించడం కోసం సహాయపడే కొన్ని సూత్రాలను ప్రతిపాదించింది.
పౌరుల బయోమెట్రిక్ డేటాను ఫేషియల్ రికగ్నిషన్ డేటాబేస్‌కు జోడించే ముందు, సంస్థలు ప్రజల నుంచి రాతపూర్వక అనుమతి పొందాలి.

Samsung Mobile: మొబైల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ ఫోన్‌ల అమ్మకాలను నిలిపేస్తున్న శాంసంగ్..


ఒక వ్యక్తి చర్మం రంగు, జాతి, మతం, జాతీయ మూలం, లింగం, వయస్సు లేదా వైకల్యాన్ని గుర్తించడానికి ఈ సాంకేతికతలను ఉపయోగించకూడదు.
డేటా విషయంలో స్పష్టమైన, రాతపూర్వక ఒప్పందం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఫలితాలు వెల్లడించడం లేదా ప్రచారం చేయకూడదు.
ఫేస్ రికగ్నిషన్ డేటా ఎల్లప్పుడూ సైబర్‌టాక్‌లు, డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో అంకితభావంతో పనిచేసే భద్రతా సిబ్బందిని కలిగి ఉన్న సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Artificial intelligence, KTR, Minister ktr, Telangana, Wef

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు