TELANGANA HYDERABAD POLICE ALERTS INTERNET USERS OVER CYBER FRAUDS NS
Cyber Frauds: యాప్స్ వాడే వారికి అలర్ట్.. ఈ జాగ్రత్త తప్పక పాటించాలన్న పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
సైబర్ నేరాలపై (Cyber Crime) అవగాహన కల్పించడంలో ఎప్పటికప్పుడూ ముందు ఉండే తెలంగాణ పోలీసులు (Telangana Police) తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు యాప్ ల విషయంలో కీలక హెచ్చరిక చేశారు.
ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్ల (Smartphones) వినియోగం పెరుగుతున్నా కొద్దీ దేశంలో సైబర్ నేరాలు (Cyber Crime) సైతం విపరీతంగా పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు అమాయకులను ఆసరగా చేసుకుని వారి ఖాతాలను కాజేస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను కాజేసి బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు కేటుగాళ్లు. అయితే.. పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా అవగాహన కల్పిస్తూ ఉన్నా.. నిత్యం అనేక మంది అమాయకులు మోసగాళ్ల వలకు చిక్కి నష్టపోతూనే ఉన్నారు.
అయితే తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఓ కీలక ప్రకటన చేశారు. యాప్ లకు పర్మిషన్లు ఇచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాప్ లకు సాధ్యమైంత తక్కువగా పర్మిషన్లు ఇవ్వాలన్నారు. కావాల్సిన పర్మిషన్లకు మాత్రమే ఇవ్వాలన్నారు. యాప్ లకు మన డేటాను మొత్తం యాక్సెస్ చేసే పర్మిషన్లు ఇస్తే మన వ్యక్తిగత డేటా యాప్ నిర్వాహకులకు, సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా చేయడం ద్వారా భవిష్యత్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. Fake SBI SMS: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. సైబర్ కేటుగాళ్ల కొత్త రూట్
— Hyderabad City Security Council (@HCSC_Hyd) May 21, 2022
ఇంకా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే.. ప్రజలు యాప్ లను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. యాప్ లను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా.. అపరిచిత వ్యక్తులు పంపించిన లింక్ లపై క్లిక్ చేసి యాప్ లను డౌన్ లోడ్ చేసే ప్రయత్నం చేయవద్దు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.