Telangana Dalit Bandhu Scheme: దళిత బంధు పథకం దరఖాస్తుకు ప్రత్యేక యాప్.. సర్కార్ కీలక నిర్ణయం.. వివరాలివే

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న దళిత బంధు పథకానికి దరఖాస్తులను యాప్ ద్వారా స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణలోని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం దళిత బంధు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షలను అందించాలని సర్కార్ భావిస్తోంది. దళితుల కోసం ఇంత భారీ ఎత్తున ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం చేపట్టలేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ పథకం పేద దళితుల జీవితాలను మారుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది సర్కార్. అక్కడ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీంతో ఆ నియోజవర్గంలో రూ. 2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పథకం అమలుకు మార్గదర్శకాలను సర్కార్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారికి ఈ దళిత బంధు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది.
    EAMCET, NEET, JEEకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వివరాలివే

    ఇదిలా ఉంటే.. అత్యంత పారదర్శకంగా ఈ పథకం అమలు అయ్యేలా సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ యాప్ రూప కల్పన బాధ్యతను ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) కి సర్కార్ అప్పగించింది. యాప్ తో పాటుగా ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్ ను ఈ నెల చివరిలోగా రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు సర్కార్ సూచించింది.

    హుజూరాబాద్ నియోజవర్గంలో ఈ పథాకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అములు చేసిన తర్వాత దీన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. ఇందు కోసం రూ.1200 కోట్లను కేటాయించినట్లు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మధ్యవర్తులతో ప్రేమయం లేకుండా.. రైతుబంధు ప‌థ‌కం మాదిరిగానే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను సర్కార్ జమ చేయనుంది. మొదటి దశలో కొంత లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి వారి ఖాతాల్లో నేరుగా డబ్బును జమచేస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published: