ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందే...ఐటీ కంపెనీలకు వార్నింగ్

Telangana Election 2019: అత్యవసర ప్రాజెక్టు పేరుతో గురువారం ఉద్యోగులకు సెలవు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ఐటీ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా, గురువారం తప్పనిసరిగా ప్రభుత్వ సెలవు దినం ఇవ్వాలని ఆదేశించింది.

news18india
Updated: April 10, 2019, 4:52 PM IST
ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందే...ఐటీ కంపెనీలకు వార్నింగ్
నమూనా చిత్రం
news18india
Updated: April 10, 2019, 4:52 PM IST
తెలంగాణ‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఐటీ సంస్థలు గురువారం  ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ డే సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు దినం ప్రకటించాయి. అయితే మరికొన్ని ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులకు విఘాతం కలుగుతుందంటూ ఉద్యోగులకు సెలవు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. సెలవు తీసుకుని ప్రాజెక్టులకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

దీంతో ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితి నెలకొంటోంది. దీంతో ఉద్యోగులు తమకు గురువారం సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సెలవు ఇవ్వకపోవడం అంటే రాజ్యాంగం కల్పించిన ఓటింగ్ హక్కును కాలరాయడమేనని మండిపడుతున్నారు.

ఐటీ ఉద్యోగుల తరఫున ఫోరమ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయిస్ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిశారు. పలు విదేశీ ఐటీ సంస్థలు సెలవు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సెలవు ఇవ్వకుండా రాజ్యాంగ హక్కును ఉల్లంఘిస్తున్న ఐటీ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ అధికారులు, ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా వారికి సెలవు ఇవ్వాలని ఐటీ కంపెనీలను ఆదేశించారు. ఉద్యోగులకు గురువారం రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలంటూ తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఆదేశాలు జారీ చేశారు.

First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...