హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tecno Spark Go: రూ.7 వేల కన్నా తక్కువ ధరకే ‘టెక్నో స్పార్క్ గో (2023)’స్మార్ట్‌ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలివే..!

Tecno Spark Go: రూ.7 వేల కన్నా తక్కువ ధరకే ‘టెక్నో స్పార్క్ గో (2023)’స్మార్ట్‌ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలివే..!

Tecno Spark Go: రూ.7 వేల కన్నా తక్కువ ధరకే ‘టెక్నో స్పార్క్ గో (2023)’స్మార్ట్‌ఫోన్ లాంచ్..

Tecno Spark Go: రూ.7 వేల కన్నా తక్కువ ధరకే ‘టెక్నో స్పార్క్ గో (2023)’స్మార్ట్‌ఫోన్ లాంచ్..

Tecno Spark Go: టెక్నో (Tecno) కంపెనీ తాజాగా టెక్నో స్పార్క్ గో (2023) ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. పెద్ద బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ రీడర్, డ్యుయల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ (Smartphone) మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు వివిధ కంపెనీలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్, మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్ల విభాగంలో కొన్ని కంపెనీలు టాప్ రేంజ్‌లో నిలుస్తున్నాయి. అయితే ఎంట్రీలెవల్ ఫోన్ల మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది టెక్నో (Tecno) కంపెనీ. ఇప్పటికే ఇండియాలో ఈ విభాగంలో కొన్ని మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ, తాజాగా టెక్నో స్పార్క్ గో (2023) ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. పెద్ద బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ రీడర్, డ్యుయల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. కేవలం రూ.6.999 ధరకే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు చూద్దాం.

* ఫీచర్లు

టెక్నో స్పార్క్ గో (2023) ఫోన్ 6.5-అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది 480 నిట్స్ బ్రైట్‌నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో మంచి అవుట్‌పుట్ అందిస్తుంది. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, స్టాండర్ట్ 60Hz రిఫ్రెష్ రేట్‌కు ఈ ప్యానెల్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ ఉంటుంది. IPX2 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ దీని మరో స్పెషాలిటీ.

టెక్నో స్పార్క్ గో (2023) ఫోన్ 3GB RAM, మీడియాటెక్ హీలియో A22 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 32GB కాగా, మైక్రో SD కార్డ్ ద్వారా దీన్ని మరింత విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ టెక్నో కస్టమ్ HiOS 12 ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. Wi-Fi, బ్లూటూత్, GPS, 4G వంటి కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ ఫోన్ అతి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లను అందిస్తోంది.

* కెమెరా, బ్యాటరీ

టెక్నో స్పార్క్ గో (2023) ఫోన్‌లో 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. USB టైప్-C పోర్ట్‌తో దీన్ని ఛార్జ్ చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యుయల్ కెమెరాలు ఉంటాయి. కెమెరా సెటప్‌లో 13 MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు సెకండరీ AI లెన్స్‌ ఉంటాయి. సెల్ఫీల కోసం వాటర్‌డ్రాప్ నాచ్ 5 MP సెల్ఫీ కెమెరాను కంపెనీ అందిస్తోంది.

ఇది కూడా చదవండి : ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. రూ.25వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై ధమాకా ఆఫర్లు!

* ధర ఎంత?

ఇండియాలో టెక్నో స్పార్క్ గో (2023) ఫోన్ 3GB/32GB మోడల్‌ ధర రూ.6,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబ్యులా పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ జనవరి 23న ఇండియాలో అధికారికంగా లాంచ్ అయింది. అదే తేదీ నుంచి వివిధ రిటైల్ అవుట్‌లెట్స్‌లో ఇవి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చాయి.

First published:

Tags: Latest Technology, Smartphones, Tech news

ఉత్తమ కథలు