హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tecno Spark 9: టెక్నో స్పార్క్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది మీకు..!

Tecno Spark 9: టెక్నో స్పార్క్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది మీకు..!

టెక్నో స్పార్క్

టెక్నో స్పార్క్

బడ్జెట్ ఫోన్ (Budget Phone) కొనాలనుకునే వారికి ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ టెక్నో (Tecno) గుడ్ న్యూస్ చెప్పింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో కేవలం రూ.10 వేల లోపు ధరతో టెక్నో స్పార్క్ 9 (Tecno Spark 9) ఫోన్‌ను తాజాగా లాంచ్ చేసింది.

బడ్జెట్ ఫోన్ (Budget Phone) కొనాలనుకునే వారికి ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ టెక్నో (Tecno) గుడ్ న్యూస్ చెప్పింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో కేవలం రూ.10 వేల లోపు ధరతో టెక్నో స్పార్క్ 9 (Tecno Spark 9) ఫోన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఈ సరికొత్త మొబైల్‌ను ఈ రోజే విడుదల చేయగా... ఫోన్ సేల్ మాత్రం జులై 23, 2022 ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ ఫోన్ ధర, కలర్ ఆప్షన్స్, ఫీచర్లను వెల్లడించింది. అంతేకాకుండా దీనిని ఎక్కడ కొనుగోలు చేయవచ్చో కూడా తెలిపింది. బడ్జెట్ మొబైల్ టెక్నో స్పార్క్ 9 ఫీచర్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

టెక్నో స్పార్క్ 9 ధర, అవైలబిలిటీ

Tecno Spark 9 ధరను రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. అధికారిక Tecno, Amazon వెబ్‌సైట్స్‌ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్కై మిర్రర్, ఇన్ఫినిటీ బ్లాక్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. టెక్నో స్పార్క్ 9 జులై 23 నుంచి అమ్మకానికి వస్తుంది. ప్రైమ్ డే సేల్ సందర్భంగా జులై 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

 ఇదీ చదవండి: షాకింగ్ సర్వే .. ఆ పని చేసే మహిళలకు పెళ్లి కావడం లేదంటా..! కారణాలు చదివితే ఆశ్చర్యపోతారు..!!


టెక్నో స్పార్క్ 9 ఫీచర్లు

టెక్నో స్పార్క్ 9 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ డాట్ డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8.6 HiOS ఆధారిత ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 13MP డ్యూయల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం సింగిల్ ఫ్లాష్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఇందులో అందించారు. బ్యాక్ కెమెరా AI ఎన్‌హాన్స్‌డ్‌ ఇమేజ్ సిస్టమ్ తో ఫొటోలను చక్కగా తీస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌, ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో ఫోన్ వస్తుంది.

టెక్నో స్పార్క్ 9 మొబైల్ 6GB+128GB RAM వంటి ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ అయింది. 512GB వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 5GB వర్చువల్ ర్యామ్‌ కూడా ఆఫర్ చేస్తుంది. అలా 11GB RAM గల స్మార్ట్‌ఫోన్‌గా వర్క్ అవుతుంది. ఈ భారీ RAM తో అప్లికేషన్స్‌ను అత్యంత వేగంగా లాంచ్‌ చేయవచ్చు. అలానే సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో అందించిన 5,000mAh బ్యాటరీ, 3.5mm ఆడియో జాక్, DTS స్పీకర్లు, కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో Tecno Spark 9 రెడ్‌మీ 10A, రియల్‌మీ C31, పోకో C31 వంటి వాటికి పోటీగా నిలుస్తుంది.

https://twitter.com/TecnoMobileInd/status/1548963286959509504?t=FKokZA971DLIFct2ChvcXQ&s=19

First published:

Tags: 5g smart phone, New mobiles, New smart phone, Tech news

ఉత్తమ కథలు