రూ.10,000 సెగ్మెంట్‌లో టెక్నో మొబైల్స్ నుంచి ఓ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. టెక్నో స్పార్క్ 8 ప్రో (Tecno Spark 8 Pro) మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. స్పార్క్ సిరీస్‌లో రిలీజ్ అయిన బడ్జెట్ మొబైల్ ఇది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ ఇన్ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,599. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో ఉన్న రియల్‌మీ నార్జో 50ఏ, సాంసంగ్ గెలాక్సీ ఎం12, రెడ్‌మీ 9 పవర్, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 లాంటి మోడల్స్‌కు టెక్నో స్పార్క్ 8 ప్రో గట్టి పోటీ ఇవ్వనుంది.
టెక్నో స్పార్క్ 8 ప్రో సేల్ అమెజాన్‌లో జనవరి 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. విన్సార్ వయొలెట్, కొమోడో ఐల్యాండ్, టర్కోయిస్ సియాన్, ఇంటర్‌సెల్లార్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. స్పెషల్ లాంఛ్ ప్రైస్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,599 ధరకే కొనొచ్చు. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. ఈ ధర కొన్ని రోజులే ఉంటుంది. ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర తెలియాల్సి ఉంది.
Xiaomi 11i Hypercharge: కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ప్రత్యేకతలివే
The #SparkOfBigDreams is here!
Spark 8 Pro powered by 33W Super Charger, G85 Gaming Processor, and a 48MP Night Camera at a special launch price of Rs. 10,599 as an Amazon Special. Sales start on 4th Jan’22.
Get Notified on https://t.co/OdWtJZ57pX#TECNO #Spark8Pro pic.twitter.com/vTpUZApUkl
— TecnoMobileInd (@TecnoMobileInd) December 29, 2021
టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. వర్చువల్ మెమొరీ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా 3జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. టెక్నో స్పార్క్ 8 ప్రో మొబైల్‌లో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సెంటర్ డాట్ ఇన్ పర్‌ఫెక్ట్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో ఇన్ఫీనిక్స్ నోట్ 11ఐ, రియల్‌మీ నార్జో 50ఏ రెడ్‌మీ నోట్ 9 లాంటి మొబైల్స్ ఉన్నాయి.
Samsung Galaxy M52 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్... ఆఫర్ 3 రోజులే
టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. అల్‌ట్రా సెన్సింగ్ టెట్రాసెల్ టెక్నాలజీతో సూపర్ నైట్ షాట్ ఫీచర్ ఉంది. స్లో మోషన్, వీడియో బొకే, వీడియో బ్యూటీ ఇంటెలిజెంట్ ఫోకస్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ సూపర్ ఛార్జర్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీ, జీపీఎస్, వైఫై, ఓటీజీ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Smartphone