Home /News /technology /

Tecno Spark 8 Pro: బడ్జెట్ ధరలో 48 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు... టెక్నో స్పార్క్​ 8 ప్రో స్మార్ట్​ఫోన్​ రిలీజ్

Tecno Spark 8 Pro: బడ్జెట్ ధరలో 48 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు... టెక్నో స్పార్క్​ 8 ప్రో స్మార్ట్​ఫోన్​ రిలీజ్

Tecno Spark 8 Pro: బడ్జెట్ ధరలో 48 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు... టెక్నో స్పార్క్​ 8 ప్రో స్మార్ట్​ఫోన్​ రిలీజ్

Tecno Spark 8 Pro: బడ్జెట్ ధరలో 48 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు... టెక్నో స్పార్క్​ 8 ప్రో స్మార్ట్​ఫోన్​ రిలీజ్

Tecno Spark 8 Pro | టెక్నో నుంచి స్పార్క్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

బడ్జెట్​ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ టెక్నో నుంచి మరో స్మార్ట్​ఫోన్​ రిలీజైంది. టెక్నో స్పార్క్​ 8 ప్రో (Tecno Spark 8 Pro) పేరుతో దీన్ని బంగ్లాదేశ్‌ మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ మొత్తం రెండు విభిన్న కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మీడియా టెక్​ హీలియో జీ 85 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్ వెనుకవైపు ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​తో వస్తుంది. వీటిలో 48- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా హైలెట్​గా నిలువనుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇక, స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజైన వనిల్లా టెక్నో స్పార్క్​ 8 మోడల్‌కు ఇది అప్‌గ్రేడ్‌ వెర్షన్​గా విడుదలైంది.

టెక్నో స్పార్క్​ 8 ప్రో ధర, లభ్యత


టెక్నో స్పార్క్ 8 ప్రో బంగ్లాదేశ్‌ మార్కెట్​లోకి సింగిల్​ వేరియంట్​లో విడుదలైంది. 6 జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ BDT 16,990 (దాదాపు రూ. 14,700) ధర వద్ద లభిస్తుంది. ఇది ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, కొమోడో ఐలాండ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కాగా, ప్రస్తుతానికి బంగ్లాదేశ్​లో లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​ భారత దేశంలో ఎప్పుడు లాంచ్​ అవుతుందనే దానిపై స్పష్టత లేదు.

Apple AirPods: ట్యాబ్లెట్ అనుకొని ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ... ఆ తర్వాత ఏం జరిగిందంటే

టెక్నో స్పార్క్ 8 ప్రో స్పెసిఫికేషన్లు


టెక్నో స్పార్క్​ 8 ప్రో స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్​ 11 ఆధారిత HiOS v7.6తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 6.8 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్​, 64 జీబీ eMMC 5.1 ఇంటర్నల్​ స్టోరేజ్​ను కలిగి ఉంటుంది. ఎస్​డీ కార్డు సహాయంతో స్టోరేజ్​ని 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇందులో 48- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2- మెగాపిక్సెల్ ఏఐ లెన్స్ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా సెటప్​లో డ్యూయల్-ఎల్​ఈడీ ఫ్లాష్‌ను అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం డ్యూయల్ ఎల్​ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చేర్చింది.

Truecaller: ఫోన్ కాల్స్ రికార్డ్ చేయాలా? ట్రూకాలర్ యాప్‌లో చేయొచ్చు ఇలా

కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్, 4జీ, బ్లూటూత్ v5, ఎఫ్​ఎం రేడియో, జీపీఎస్​, మైక్రో-యూఎస్​బీ పోర్ట్, ఓటీజీ, వైఫై, యూఎస్​బీ పోర్ట్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీని అందించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు