• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • TECNO SPARK 7T WITH 6000 MAH BATTERY LAUNCHED IN INDIA AT RS 8999 HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS GH

Tecno Smartphone: భారత్‌లోకి టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర కేవలం రూ.7,999 మాత్రమే.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

టెక్నో మొబైల్ ఇండియా త‌న స్పార్క్ 7 సిరీస్ లో స‌రికొత్త‌ మోడ‌ల్‌ను భారత మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
అర‌చేతిలో ప్ర‌పంచాన్ని ఇమిడ్చే సెల్‌ఫోన్లో రోజురోజుకూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తక్కువ ధ‌ర‌ల‌తో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌డానికి మొబైల్ కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. ఈనేప‌థ్యంలో టెక్నో మొబైల్ ఇండియా త‌న స్పార్క్ 7 సిరీస్ లో స‌రికొత్త‌ మోడ‌ల్‌ను ఇండియ‌న్ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. చౌక‌ధ‌ర‌ల‌కు ల‌భించే స్మార్ట్ ఫోన్‌తో మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసింది. కేవ‌లం రూ.7999కే 4 జీబీ రామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ సామ‌ర్థ్యంతో స్పార్క్ 7 టీ మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. దీని అసలు ధ‌ర రూ.8999 అయిన‌ప్ప‌టికీ వెయ్యి రూపాయ‌ల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఆప్ష‌న్లు ఇష్ట‌ప‌డేవారిని ఆక‌ట్టుకునేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. టెక్నో మొబైల్ ఇండియా రూపొందించిన స్పార్క్ 7 సిరీస్‌లో తాజాగా 7టీ మోడ‌ల్‌ను ఆవిష్క‌రించింది. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మూడు రంగుల‌లో ఈ ఫోన్ల‌ను అందుబాటులో ఉంచారు.
Airtel Rs 456 Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.456 ప్లాన్ ప్రకటించిన కంపెనీ
OnePlus Nord N200 5G: వన్‌ప్లస్‌ నుంచి మరో 5జీ ఫోన్‌... ఈ సారి తక్కువ ధరలో

బ్లూ, మాగ్నెట్‌, నెబ్యూలా ఆరెంజ్ రంగుల‌లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. ఇక ఫోన్ డిస్‌ప్లే విష‌యానికొస్తే 6.52 అంగుళాల హెచ్‌డి డాట్ డిస్ ప్లేతో 1600: 720 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో ఈ డివైజ్‌ను రూపొందించారు. ఇందులో వెనుకవైపు 48 మెగాపిక్సెల్స్‌ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో ఫ్రంట్ కామ్‌ను చేర్చారు. క‌నెక్ట‌విటీ ఫీచర్లలో జీపీఎస్‌, బ్లూటూత్‌, ఓటీజీ స‌పోర్ట్‌, వైఫై, 4 జీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై న‌డిచే ఈ ఫోన్ బ్యాట‌రీ 6000 ఎంఏహెచ్‌తో లభిస్తుంది. ఈ బ్యాట‌రీ కెపాసిటీతో 193 గంట‌ల మ్యూజిక్ విన‌వ‌చ్చు. 29గంట‌లు వీడియో ప్లే చేసుకోవ‌చ్చు. నేటి యువ‌త అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్పార్క్ 7టి ఫోన్ అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్లతో ఆక‌ట్టుకోనుంది. ముఖ్యంగా వీడియోలు తీయ‌డానికి, గేమింగ్‌కు ఈ సెల్‌ఫోన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్ స‌మాచార మార్పిడికంటే కూడా వినోద‌సాధ‌నంగా మారింది. ఈ మార్పును దృష్టిలో పెట్టుకుని టెక్నో సంస్థ ఈ 7టి మొబైల్‌ను రూపొందించింది. పెద్ద మొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన టెక్నో.. త‌న మొబైల్ ఉత్ప‌త్తుల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు విన్నూత్నంగా ఆలోచిస్తోంది. 60 దేశాల‌లో సంస్థ మొబైల్ విక్ర‌యాల‌ను కొన‌సాగిస్తోంది. ఈ హాంకాంగ్ బేస్డ్ కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసిన 7టి మోడ‌ల్ ఏ స్థాయి విక్ర‌యాలు నమోదు చేస్తుందో చూడాలి.
Published by:Nikhil Kumar S
First published: