Tecno Spark: కేవలం రూ.8 వేలకే..5 కెమెరాల స్మార్ట్ ఫోన్...అదిరిపోయే ఫీచర్లు...సేల్ ప్రారంభం...

ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే 5 కెమెరాలతో పాటు అతి తక్కువ ధరకే లభించింది. అలాగే చాలా శక్తివంతమైన బ్యాటరీ దీని సొంతం. ఈ ఫోన్‌ను కేవలం 7,999 రూపాయలకే లభిస్తోంది. కస్టమర్లు ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

news18-telugu
Updated: June 6, 2020, 2:24 PM IST
Tecno Spark: కేవలం రూ.8 వేలకే..5 కెమెరాల స్మార్ట్ ఫోన్...అదిరిపోయే ఫీచర్లు...సేల్ ప్రారంభం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ట్రాన్స్ హోల్డింగ్స్ సంస్థ నుంచి వచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో ఇటీవల తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ స్పార్క్ 5 (tecno spark 5) ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ క్వాడ్ రెర్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే 5 కెమెరాలతో పాటు అతి తక్కువ ధరకే లభించింది. అలాగే చాలా శక్తివంతమైన బ్యాటరీ దీని సొంతం. ఈ ఫోన్‌ను కేవలం 7,999 రూపాయలకే లభిస్తోంది. కస్టమర్లు ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం ...

ఈ స్మార్ట్‌ఫోన్ 6.60-అంగుళాల డిస్‌ప్లే తో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 720x1600 పిక్సెల్స్ గా అందించారు. ఇక మీడియాటెక్ హెలియో ఎ 22 చిప్‌సెట్‌ను రెండు జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమరీతో కలిగి ఉంది. దీని మెమరీని 256 జీబీకి పెంచవచ్చు. ఇది ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఆధారంగా 6.1 హియోస్ (ఆపరేటింగ్ సిస్టమ్) పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఐస్ జాడైట్ అలాగే స్పార్క్ ఆరెంజ్ అనే రెండు రంగుల్లో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

అత్యంత తక్కువ ధరకే 5 కెమెరాలు...

ఇక కెమెరా గురించి మాట్లాడితే, మీరు ఫోన్ వెనుక ప్యానెల్‌లో నాలుగు కెమెరాలను అమర్చారు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, రెండు మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ అలాగే AI కెమెరాతో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. అలాగే సెల్ఫీ కెమెరాతో కలిపి మొత్తం 5 కెమెరాలను అందించారు.

క్వాలిటీ ఫోటోగ్రఫీ అనుభవం కోసం, ఫోన్‌లో మాక్రో ఫోటోగ్రఫీ, బోకె ఎఫెక్ట్, AI హెచ్‌డిఆర్, ఎఆర్ మోడ్ వంటి ఫీచర్లు అందించారు. బ్యాటరీ సామర్థ్యం కోసం ఈ ఫోన్ లో 5000 mAh శక్తివంతమైన బ్యాటరీ అందించారు.

టెక్నో మొబైల్ హోమ్ డెలివరీ కోసం మీకు ఇష్టమైన రిటైలర్ ద్వారా ఆర్డర్‌పై క్లిక్ చేయండి. వినియోగదారులు ఇప్పుడు కొత్త 'డోర్‌స్టెప్ డెలివరీ' ఎంపికను పొందవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు, మార్గదర్శకాలకు లోబడి ఈ మొబైల్ ఫోన్ డెలివరీ చేయనున్నారు. మార్గదర్శకాలను అనుసరించి 24 గంటల్లో పంపిణీ చేయనున్నారు.
Published by: Krishna Adithya
First published: June 6, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading