హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tecno Pova Neo 5G: ఇండియాలో అదిరే ఫీచర్లతో టెక్నో పోవా నియో 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే..

Tecno Pova Neo 5G: ఇండియాలో అదిరే ఫీచర్లతో టెక్నో పోవా నియో 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే..

Tecno Pova Neo 5G: ఇండియాలో అదిరే ఫీచర్లతో టెక్నో పోవా నియో 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే..

Tecno Pova Neo 5G: ఇండియాలో అదిరే ఫీచర్లతో టెక్నో పోవా నియో 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే..

Tecno Pova Neo 5G: టెక్నో కంపెనీ ఇండియాలో ఎక్కువగా బడ్జెట్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల 5G ఫోన్లను రూపొందిస్తున్నట్లు చెప్పిన కంపెనీ, తాజాగా పోవా నియో 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. పోవా నియో 5G ఫోన్ ఏకంగా 6,000mAh కెపాసిటీ ఉండే బ్యాటరీతో వస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ టెక్నో (Tecno) నుంచి ఇండియన్ మార్కెట్లో (Indian Market)కి వరుసగా కొత్త ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. మన దేశంలో మరికొన్ని రోజుల్లో 5G నెట్‌వర్క్ (5G Network) సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కంపెనీ కొత్త 5G ఫోన్‌ను రిలీజ్ చేసింది. పోవా సిరీస్‌లో కొత్తగా ‘టెక్నో పోవా నియో 5జీ’ (Tecno Pova Neo 5G) స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ బడ్జెట్ డివైజ్‌లో కొన్ని హై రేంజ్ ఫీచర్లను అందించింది. ఎక్కువ కెపాసిటీ ఉండే బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ ఈ కొత్త ఫోన్ ప్రత్యేకతలు. ఈ కొత్త మోడల్ ధర, స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం.

బడ్జెట్ రేంజ్‌లో వచ్చే 5G ఫోన్‌ల విషయంలో కంపెనీలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మేకింగ్ కాస్ట్‌ను తగ్గించుకునేందుకు చిప్, బ్యాక్ కెమెరాలను మీడియం రేంజ్‌లోనే అందిస్తున్నాయి. రియర్ కెమెరా సెటప్‌లో ఇప్పుడు చాలా ఫోన్లు రెండు లెన్స్‌లనే అందిస్తున్నాయి. వీటితోపాటు AMOLED ప్యానెల్‌, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇతర బెస్ట్ స్పెసిఫికేషన్లలో కాంప్రమైజ్ అవుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా నియో 5జీ ఫోన్‌ కూడా ఇలాంటి అడ్జెస్టబుల్ ఫీచర్లతో వచ్చింది.

* స్పెసిఫికేషన్లు

టెక్నో కంపెనీ ఇండియాలో ఎక్కువగా బడ్జెట్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల 5G ఫోన్లను రూపొందిస్తున్నట్లు చెప్పిన కంపెనీ, తాజాగా పోవా నియో 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. పోవా నియో 5G ఫోన్ ఏకంగా 6,000mAh కెపాసిటీ ఉండే బ్యాటరీతో వస్తుంది. అయితే ఇది 18W ఛార్జింగ్ స్పీడ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, AI లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ ఉంటుంది.

ఈ ఫోన్ 6.9 అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో పాటు ఫుల్ HD+ రిజల్యూషన్‌తో బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. పోవా నియో 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫోన్‌కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు USB C పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 4GB RAM, 128GB స్టోరేజ్‌ దీని సొంతం. మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి : మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.15 వేలకే 55 అంగుళాల స్మార్ట్‌టీవీలు!

* ధర ఎంత?

ఇండియాలో టెక్నో పోవా నియో 5G ఫోన్ రూ.15,499 ధరతో లాంచ్ అయింది. కంపెనీ ప్రస్తుతం 4GB + 128GB వేరియంట్‌ను మాత్రమే అందిస్తోంది. దీన్ని ఆన్‌లైన్ పోర్టళ్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: 5g mobile, Smart phones, Tech news

ఉత్తమ కథలు