హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tecno Pova 4: టెక్నో పోవా 4 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు

Tecno Pova 4: టెక్నో పోవా 4 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tecno Pova 4: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫోన్‌లు లాంచ్ చేస్తూ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. టెక్నో తాజాగా పోవా 4ను ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6nm Helio G99 SoC ప్రాసెసర్‌పై పని చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Tecno Pova 4: ఇండియాలో మీడియం సెగ్మెంట్‌ ఫోన్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ రేంజ్‌ ఫోన్‌ సేల్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకు చాలా కంపెనీలు మీడియం రేంజ్‌లో బెస్ట్‌ ఫీచర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno).. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫోన్‌లు లాంచ్ చేస్తూ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. టెక్నో తాజాగా పోవా 4ను ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6nm Helio G99 SoC ప్రాసెసర్‌పై పని చేస్తుంది. హైపర్-ఇంజిన్ 2.0 లైట్, పాంథర్ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఇన్-బిల్ట్ డ్యూయల్ గేమింగ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

టెక్నో పోవా 4 స్పెసిఫికేషన్లు

టెక్నో పోవా 4 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 90Hz రిఫ్రెషర్ రేట్‌తో కూడిన 6.82-అంగుళాల HD+ డాట్-ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6nm MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది పాంథర్ గేమ్ ఇంజిన్ 2.0, హైపర్‌ఇంజిన్ 2.0 లైట్‌తో కూడిన ఇన్-బిల్ట్ గేమింగ్ ఇంజిన్‌తో వస్తుంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో పాటు 13 GB ర్యామ్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB uMCP ఇంటర్నల్ మెమరీతో పాటు 2TB ఎక్స్టెండబుల్ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా పరంగా చూస్తే.. 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ సెన్సార్‌ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆధారిత HiOS 12.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్, ప్లేబ్యాక్ లేదా కాల్‌ను పొందవచ్చు.

టెక్నో పోవా 4 ధర

ఇండియన్‌ మార్కెట్లో టెక్నో పోవా4 స్మార్ట్‌ఫోన్‌ రూ.11,999 వద్ద లభిస్తుంది. దీన్ని ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 13 నుంచి వీటి సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మాగ్నా ఆరెంజ్, క్రైయోలైట్ బ్లూ, యురనోలిత్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఏడాదిలోనే లాంచ్‌ అయిన టెక్నో స్పార్క్ 9 ప్రో

ఈ ఏడాది ప్రారంభంలో, టెక్నో తన స్పోర్ట్స్ ఎడిషన్ టెక్నో స్పార్క్ 9 ప్రో ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ కెమెరా మాడ్యూల్స్‌తో పాటు వెనుక ప్యానెల్ ప్రత్యేకమైన బ్లూ, వైట్ కలర్ థీమ్‌తో వస్తుంది. టెక్నో పోవా 4 స్పోర్ట్స్ ఎడిషన్ టెక్నో స్పార్క్ 9 ప్రో తో సమానమైన ఫీచర్లను అందిస్తోంది. టెక్నో స్పార్క్ 9 ప్రో FHD+ రిజల్యూషన్‌తో 6.6 -అంగుళాల IPS LCD స్క్రీన్‌ను పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ హీలియో G85 చిప్‌సెట్‌తో రన్‌ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్‌ HiOS 8.6 ఓఎస్‌తో పని చేస్తుంది.

First published:

Tags: Smart phone, Technology

ఉత్తమ కథలు