మన దేశంలో ప్రస్తుతం మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్లపై టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు దృష్టి పెడుతున్నాయి. అయితే ఇండియాలో బడ్జెట్ ఫోన్ల హవా మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. దాదాపు అన్ని కంపెనీలో క్రమం తప్పకుండా తక్కువ ధరలో రీజనబుల్ ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ టెక్నో (Tecno) కొత్తగా పోవా (Pova) సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లో అధికారికంగా అప్డేట్ చేసింది. ఈ సిరీస్ నుంచి టెక్నో పోవా 3 (Tecno Pova 3) పేరుతో కొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇది టెక్నో పోవా 2 ఫోన్‌కు సక్సెసర్‌గా వస్తోంది. ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల డిస్ప్లే, హై రేంజ్ 7,000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో రిలీజ్ అయింది.
టెక్నో పోవా 3 ఫోన్ లాంచ్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తక్కువ ధరలో అతిపెద్ద బ్యాటరీని అందిస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
ధర ఎంత?
టెక్నో పోవా 3 ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. కస్టమర్లు 4GB+64GB, 6GB+128GB స్టోరేజ్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. కంపెనీ ప్రస్తుతం 64GB వేరియంట్ ధరను ప్రకటించింది. దీని ధర రూ.11,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 27 నుంచి అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ ఎకో బ్లాక్, టెక్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 1080x2460 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.9-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G88 చిప్సెట్ సాయంతో పనిచేస్తుంది. ముందుగా చెప్పినట్లు ఈ స్మార్ట్‌ఫోన్ 64GB, 128GB వంటి రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. టెక్నో పోవా 3 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇది 4D వైబ్రేషన్లను అందించే Z-యాక్సిస్ లీనియర్ మోటార్‌తో వస్తుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, క్వాడ్-LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్ ఉంది. టెక్నో పోవా 3 ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని 40 నిమిషాల్లో 50% ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smart phone