Home /News /technology /

TECNO POP 5X LAUNCH SPECIFICATIONS FEATURES ANDROID 10 GO EDITION GH VB

Tecno Pop 5X: కేవలం రూ.8,600లకే స్మార్ట్ ఫోన్ .. ట్రిపుల్ కెమెరాతో పాటు.. మరెన్నో ఫీచర్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్నో పాప్ 5ఎక్స్ (Tecno Pop 5X) అనే మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో లాంచ్ చేసింది. తన పాప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల్లో భాగంగా దీన్ని టెక్నో సంస్థ విడుదల చేసింది.

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ (Tecno Mobile) తక్కువ ధరలకే అదిరిపోయే ఫీచర్లతో ఫోన్స్ రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా టెక్నో పాప్ 5ఎక్స్ (Tecno Pop 5X) అనే మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో లాంచ్ చేసింది. తన పాప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల్లో భాగంగా దీన్ని టెక్నో సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ఇటీవల భారతదేశంలో టెక్నో పాప్ 5 ప్రో (Tecno Pop 5 Pro), టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ (Tecno Pop 5 LTE)లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే టెక్నో పాప్ 5 ఎక్స్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ మెక్సికో (Mexico)లో లాంచ్ అయ్యింది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాను అందించారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ ధర, మిగతా ఫీచర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Students-Stipend: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందులో సెలెక్ట్ అయితే రూ.25,000 స్టైఫండ్‌.. ఎలా అంటే..


టెక్నో పాప్ 5ఎక్స్ ధర, లభ్యత
టెక్నో పాప్ 5ఎక్స్ ధరను కంపెనీ ఇంకా మెక్సికో వెబ్‌సైట్‌లో వెల్లడించలేదు. ఈ వెబ్‌సైట్‌ ప్రకారం, కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాస్మిక్ షైన్, క్రిస్టల్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో వచ్చింది. ఇది పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. భారతదేశం, ఇతర మార్కెట్‌లలో టెక్నో పాప్ 5X లభ్యత, దాని ధర వంటి వివరాలను టెక్నో సంస్థ ఇంకా వెల్లడించలేదు. లాటిన్ అమెరికా దేశమైన మెక్సికోలో ఇది 115 డాలర్లకు లభిస్తోంది. దీన్నిబట్టి ఇండియాలో ఇది సుమారు రూ.8,600 ధరతో లాంచ్ అవుతుందని చెప్పవచ్చు.

టెక్నో పాప్ 5ఎక్స్ స్పెసిఫికేషన్స్
టెక్నో పాప్ 5ఎక్స్ డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్)పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచుల (720x1,600 పిక్సెల్‌లు) హెచ్‌డీ+ డిస్‌ప్లేతో, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో వస్తుంది. ఇది 2జీబీ ర్యామ్ తో 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ప్రాసెసర్ ఏంటి అనేది కంపెనీ స్పష్టంగా తెలపలేదు. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించడం విశేషం. వాటిలో రెండు QVGA రిజల్యూషన్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఇది 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇందులో ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Ravi Shastri: రంజీ ట్రోఫీపై ర‌విశాస్త్రి ఆసక్తికర కామెంట్స్.. భార‌త టీమ్‌లో వారు ఉండటం కష్టమే అంటూ వ్యాఖ్య..


టెక్నో పాప్ 5ఎక్స్ ఒక మైక్రో ఎస్‌డీ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అయితే ఎంత వరకు అనేది ఇంకా తెలియరాలేదు. ఇది 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 4జీ LTE, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎం వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మైక్రో-యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఛార్జ్ అయ్యే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీపై ఈ స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. ఏఐ-ఆధారిత పవర్ మేనేజ్మెంట్ 10 శాతం వరకు మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుంది. ఇది 166x75.90x8.5mm కొలతలతో 150 గ్రాముల బరువు ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు