TECNO POP 5 PRO SMARTPHONE LAUNCHED IN INDIA WITH 6000MAH BATTERY KNOW PRICE AND SPECIFICATIONS SS
Tecno Pop 5 Pro: భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్స్‌తో టెక్నో పాప్ 5 ప్రో రిలీజ్... ధర రూ.8,499 మాత్రమే
Tecno Pop 5 Pro: భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్స్‌తో టెక్నో పాప్ 5 ప్రో రిలీజ్... ధర రూ.8,499 మాత్రమే
(image: Tecno Mobile)
Tecno Pop 5 Pro | రూ.10,000 లోపు బడ్జెట్లో టెక్నో మొబైల్ నుంచి టెక్నో పాప్ 5 ప్రో (Tecno Pop 5 Pro) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇందులో భారీ బ్యాటరీ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో మొబైల్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇటీవల టెక్నో మొబైల్ నుంచి టెక్నో పాప్ 5 ఎల్టీఈ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టెక్నో పాప్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రూ.10,000 లోపు సెగ్మెంట్లో టెక్నో పాప్ 5 ప్రో (Tecno Pop 5 Pro) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది టెక్నో మొబైల్. ఇందులో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 14 భారతీయ భాషల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.
టెక్నో పాప్ 5 ప్రో ధర
టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ కేవలం 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.8,499. రూ.10,000 లోపు (Smartphone Under Rs 10000) బడ్జెట్లో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ నార్జో 50ఐ, పోకో సీ31, రెడ్మీ 9ఏ స్పోర్ట్, సాంసంగ్ గెలాక్సీ ఎం12 లాంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్‌కు టెక్నో పాప్ 5 ప్రో పోటీ ఇవ్వనుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు టెక్నో మొబైల్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. రీటైల్ ఔట్‌లెట్స్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. డీప్సీ లస్టర్, ఐస్ బ్లూ, స్కై సియాన్ కలర్స్‌లో కొనొచ్చు.
Get, Set, Pop!
Get ready to experience POP 5Pro powered by amazing features like 6000mAh powerful battery, 3+32GB internal memory, and 8MP AI Dual Rear Camera only for Rs. 8499.#TECNO#POP5Pro#PopAeadInLifepic.twitter.com/rDNY585uTZ
టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఇందులో ఏ ప్రాసెసర్ ఉందన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. 3జీబీ+32జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్‌తో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ + HiOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. HiOS లో వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, కిడ్స్ మోడ్, సోషల్ టర్బో, డార్క్ థీమ్స్, పీక్ ప్రూఫ్, వాయిస్ ఛార్జర్, యాంటీ థెఫ్ట్ అలారం లాంటి ఫీచర్స్ ఉంటాయి.
టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + ఏఐ లెన్స్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఏఐ పోర్ట్రైట్ మోడ్, హెచ్డీఆర్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం.
టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 54 గంటల టాక్‌టైమ్, 120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సేవింగ్ కోసం బ్యాటరీ ల్యాబ్ ఫీచర్, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటితో బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని అంటోంది కంపెనీ.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.