హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Led Smart Phone: రూ. 6,299 కే ఎల్ఈడీ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో సేల్స్ ఎప్పటినుంచంటే..

Led Smart Phone: రూ. 6,299 కే ఎల్ఈడీ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో సేల్స్ ఎప్పటినుంచంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ టెక్నో (Tecno) నుంచి మరో ఎంట్రీ లెవల్​​ ఫోన్​ (Entry level phone) రిలీజైంది. తాజాగా టోక్నో పాప్​ 5 ఎల్​టీఈ (Tecno Pop 5 LTE) స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్​లోకి ఆవిష్కరించింది.

బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ టెక్నో (Tecno) నుంచి మరో ఎంట్రీ లెవల్​​ ఫోన్​ (Entry level phone) రిలీజైంది. తాజాగా టోక్నో పాప్​ 5 ఎల్​టీఈ (Tecno Pop 5 LTE) స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్​లోకి ఆవిష్కరించింది. ఇది 6.5 అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్​ను(Smartphone) జెన్​ జెడ్​ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. "ఆల్-రౌండర్" పర్ఫార్మెన్స్(Performance)​ అందించడమే లక్ష్యంగా దీన్ని డిజైన్(Design)​ చేసింది. కొత్త టెక్నో పాప్ 5 ఎల్​టీఈ స్మార్ట్​ఫోన్(Led Smartphone) జనవరి 16 నుంచి​ అమెజాన్‌లో(Amazon) విక్రయానికి వస్తుంది.

Samsung Galaxy Tab A8: శామ్​సంగ్​ నుంచి మరో బడ్జెట్​ ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..


టెక్నో పాప్​ 5 ఎల్​టీఈ స్పెసిఫికేషన్లు...

టెక్నో పాప్​ 5 LTE 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్​ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.52- అంగుళాల హెచ్​డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. దీని ముందు ప్యానెల్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్​ను అందించింది. అయితే చిప్‌సెట్ వివరాలపై మాత్రం స్పష్టత లేదు. ఈ ఫోన్ 2జీబీ ర్యామ్​, 32 జీబీ ఇంటర్న్​ల్​ స్టోరేజ్​ను కలిగి ఉంటుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో విస్తరించవచ్చు. టెక్నో పాప్​ 5 LTE బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్​ 11 గో ఆధారిత HiOS 7.6పై నడుస్తుంది. ఈ ఓస్​ వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, కిడ్స్ మోడ్, సోషల్, టర్బో, డార్క్ థీమ్‌లు, పేరెంటల్ కంట్రోల్, డిజిటల్ వెల్బీయింగ్, జెస్చర్ కాల్ పిక్చర్ వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక కెమెరా మాడ్యూల్​లో 8-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్​ను అందించింది. కెమెరా యాప్ ఏఐ బ్యూటీ, ఏఐ పోర్ట్రెయిట్, 1080P వీడియో, హెచ్​డీఆర్​ ఫిల్టర్‌లు, 16 ఏఐ సీన్ డిటెక్షన్, 4X జూమ్, డ్యూయల్ ఫ్లాష్‌లైట్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇక, దీనిలో 5 -మెగాపిక్సెల్ స్నాపర్ కెమెరాను చేర్చింది. ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం ఇందులో ‘మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్’ను కూడా అందించింది.

Zodiac Signs-Astrology: ఈ రాశుల వారు ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు.. వీటిలో మీరూ ఉన్నారేమో చూసుకోండి..


టెక్నో పాప్​ 5 ఎల్​టీఈ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 31 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. 115 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 18 గంటల కాలింగ్​ను అందిస్తుంది. IPX2 వాటర్-రెసిస్టెంట్ బిల్డ్, ఫేస్ అన్‌లాక్, 3.5mm ఆడియో జాక్, 14 ప్రాంతీయ భాషలకు మద్దతిస్తుంది.

టెక్నో పాప్ 5 ఎల్​టీఈ ధర..

టెక్నో పాప్​ 5 ఎల్​టీఈ మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.- ఐస్ బ్లూ, డీప్సీ లస్టర్, టర్కోయిస్ సియాన్ కలర్లలో లభిస్తుంది. రూ. 6,299 ధర వద్ద జనవరి 16 నుంచి అమెజాన్​లో సేల్స్ ప్రారంభమవుతాయి.

First published:

Tags: Latest Technology, Technology

ఉత్తమ కథలు