బడ్జెట్ స్మార్ట్‌ఫోన్(Smart Phone) బ్రాండ్ టెక్నో భారత మార్కెట్లోకి టెక్నో పోవా నియో స్మార్ట్‌ఫోన్‌ను(Pova Neo Smart phone) లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్(Dual Selfie Flash), 6000 ఎంఏహెచ్ బ్యాటరీని(Battery) అందించింది. దీనిలో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేను చేర్చింది. దీనిలో 6జీబీ ర్యామ్ ఉంటుంది. దీన్ని ఎక్స్‌పాండబుల్ ర్యామ్ సపోర్ట్ ద్వారా మరో 5జీబీ పెంచుకోవచ్చు. అంటే ఫోన్లోని ర్యామ్‌ను మొత్తంగా 11 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.
టెక్నో పోవా నియో ధర..
టెక్నో పోవా నియో స్మార్ట్‌ఫోన్ రూ. 12,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తుంది. రేపటి (జనవరి 22) నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. టెక్నో పోవా లైనప్‌లో వచ్చిన మూడో స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీక్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,499 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి.
టెక్నో పోవా నియో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల HD+ డాట్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 84.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. హోల్ పంచ్ డిస్ప్లేను కూడా ఇందులో అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 128GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను 512GB వరకు విస్తరించవచ్చు.
కెమెరా విషయానికి వస్తే.. టెక్నో పోవా నియో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 13 -మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరాను అమర్చింది. దీని ముందు భాగంలో 8- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది. టెక్నో పోవా నియో 55 రోజుల స్టాండ్‌బై సమయం, 190 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 43 గంటల కాలింగ్ సమయాన్ని అనుమతించే పెద్ద 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
దీని వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను సైతం అమర్చింది. ఇక, కనెక్టివిటీ పరంగా చూస్తే.. డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ సపోర్ట్, యూఎస్బీ టైప్- సీ పోర్ట్ వంటివి చేర్చింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.