Home /News /technology /

Tecno Camon 18T: టెక్నో కేమన్​ 18టీ ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​... 48 ఎంపీ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు

Tecno Camon 18T: టెక్నో కేమన్​ 18టీ ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​... 48 ఎంపీ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు

Tecno Camon 18T: టెక్నో కేమన్​ 18టీ ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​... 48 ఎంపీ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Tecno Camon 18T: టెక్నో కేమన్​ 18టీ ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​... 48 ఎంపీ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు (ప్రతీకాత్మక చిత్రం)

Tecno Camon 18T | టెక్నో నుంచి మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ (Entry Level Smartphone) రిలీజ్ అయింది. టెక్నో కేమన్ 18టీ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

బడ్జెట్ ​స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ టెక్నో నుంచి మరో ఎంట్రీ లెవల్​ స్మార్ట్‌ఫోన్​ రిలీజైంది. టెక్నో కేమన్​ 18టీ (Tecno Camon 18T) పేరుతో పాకిస్థాన్‌ మార్కెట్​లోకి దీన్ని సంస్థ ఆవిష్కరించింది. టెక్నో కేమన్​ 18 సిరీస్​లో వచ్చిన తొలి మొబైల్​ ఇదే కావడం విశేషం. ఈ ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ మొత్తం మూడు విభిన్న కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మొబైల్ 48 మెగాపిక్సెల్ మెయిన్​ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​తో వస్తుంది. టెక్నో కెమెన్​ 18టీ ఆక్టా-కోర్ మీడియా టెక్​ హీలియో జీ 85 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని ధర, ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.

టెక్నో కేమన్18టీ ధర, లభ్యత


టెక్నో అధికారిక వెబ్‌సైట్​లో టెక్నో కేమన్ 18T ధర, లభ్యత వివరాలను పేర్కొనలేదు. అయితే, పాకిస్థాన్​లోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ డరాజ్​లో ఇది లిస్ట్ అయ్యింది. అక్కడ PKR 27,999 (దాదాపు రూ. 11,900) వద్ద ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 4 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ గల సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. ఇది సిరామిక్ వైట్, డస్క్ గ్రే, ఐరిస్ పర్పుల్ వంటి మల్టిపుల్​ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే భారత మార్కెట్​లోకి ఈ మోడల్ ఎప్పుడు లాంచ్​ అవుతుందనే విషయంపై స్పష్టత లేదు.

Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

టెక్నో కేమన్18టీ స్పెసిఫికేషన్లు


టెక్నో కేమన్18టీ ఆండ్రాయిడ్​ 11 ఆధారిత ఓఎస్​పై పనిచేస్తుంది. టెక్నో కేమన్​ 18 స్మార్ట్​ఫోన్ 6.8 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. టెక్నో కేమన్​ 18టీ స్మార్ట్​ఫోన్​ 4 జీబీ ర్యామ్​, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో G85 చిప్‌సెట్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో రెండు ఎల్​ఈడీ ఫ్లాష్ యూనిట్‌లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్​ను అందించింది.

Mi 4A Pro: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్ టీవీని రూ.4,999 ధరకే కొనండి ఇలా

దీని కెమెరా యూనిట్‌లో 48 -మెగాపిక్సెల్ మెయిన్​ సెన్సార్, 2 -మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లను చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 48 -మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ కెమెరాను చేర్చింది. ఇక, కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. బ్లూటూత్, వైఫై, జీపీఎస్​, ఎఫ్​ఎం రేడియో, ఎటీజీ వంటివి అందించింది. ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో ఏఐ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్​ను కూడా చేర్చింది. టెక్నో కేమన్​​18టీలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు