Home /News /technology /

TECNO CAMON 18 SMARTPHONE LAUNCHED IN INDIA WITH 48 MEGAPIXEL FRONT CAMERA KNOW PRICE AND SPECIFICATIONS SS

Tecno Camon 18: అదిరిపోయే ఫీచర్స్‌తో టెక్నో కేమన్ 18 రిలీజ్... రూ.1,999 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

Tecno Camon 18: అదిరిపోయే ఫీచర్స్‌తో టెక్నో కేమన్ 18 రిలీజ్... ఉచితంగా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్
(image: Tecno India)

Tecno Camon 18: అదిరిపోయే ఫీచర్స్‌తో టెక్నో కేమన్ 18 రిలీజ్... ఉచితంగా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ (image: Tecno India)

Tecno Camon 18 | రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ బడ్జెట్‌లో టెక్నో కేమన్ 18 (Tecno Camon 18) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? చైనాకు చెందిన మొబైల్ కంపెనీ టెక్నో (Tecno) ఇండియాలో టెక్నో కేమన్ 18 మోడల్‌ను లాంఛ్ చేసింది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో కొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. ఈ బడ్జెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ, రియల్‌మీ నార్జో 50ఏ, రెడ్‌మీ నోట్ 10ఎస్, రియల్‌మీ 8ఐ, ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నింటికీ టెక్నో కేమన్ 18 (Tecno Camon 18) గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండియాలో జూలైలో టెక్నో కేమన్ 17 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్ టెక్నో కేమన్ 18 లేటెస్ట్‌గా రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.8 అంగుళాల భారీ డిస్‌‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో 48 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం.

    టెక్నో కేమన్ 18 ధర


    టెక్నో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.14,999. డిసెంబర్ 27న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. టెక్నో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.1,999 విలువైన బడ్స్ 2 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ని ఉచితంగా అందించనుంది టెక్నో. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డస్క్ గ్రే, ఐరిస్ పర్పుల్ కలర్స్‌లో కొనొచ్చు.

    Jio Cashback: జియో యూజర్లకు అలర్ట్... ఈ మూడు ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్


    టెక్నో కేమన్ 18 స్పెసిఫికేషన్స్


    టెక్నో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజ్ అయింది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో మరో 3జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో స్టోరేజ్ 128జీబీ వరకు పెంచుకోవచ్చు.

    Infinix Note 11: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది... ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే

    టెక్నో కేమన్ 18 కెమెరా


    టెక్నో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 48 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. కెమెరాలో స్లో మోషన్, నైట్ వీడియో మోడ్, వీడియో బొకే లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    టెక్నో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + HiOS 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ వివరాలు చూస్తే 4జీ, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డీటీఎస్ సౌండ్ లాంటి ఆడియో ఫీచర్స్ కూడా ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు