ప్రముఖ కాలర్ ఐడీ(True Caller Id App) యాప్ ట్రూకాలర్ (True caller) ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్లను(Advanced Features) లాంచ్ చేస్తూ యూజర్లను(Users) ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్(Android Users) ఎక్స్‌పీరియన్స్‌ను (Experience) మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్లను(New Features) పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా మరో ఐదు అదిరిపోయే ఫీచర్ల (Features)ను ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ 5 అప్‌కమింగ్ ఫీచర్లను ట్రూకాలర్ తాజాగా ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్లన్నీ కొద్ది వారాల్లో ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కాలింగ్ కోసం వాయిస్ కాల్ లాంచర్ (Voice Call Launcher), ఎస్ఎంఎస్ ఇన్‌బాక్స్ కోసం పాస్‌కోడ్ లాక్ (Passcode Lock), ఎన్హాన్స్డ్ కాల్ లాగ్స్, ఇన్స్టంట్ కాల్ రీజన్ (Instant Call Reason), వీడియో కాలర్ ఐడీ కోసం ఫేస్ ఫిల్టర్స్ (Face Filters), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ అసిస్టెంట్ (AI Smart Assistant) వంటి 5 ఫీచర్లను ట్రూకాలర్ పరిచయం చేయనుంది.
ట్రూకాలర్ ఇండియా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ & ఎండీ రిషిత్ జున్‌జున్‌వాలా మాట్లాడుతూ “కొత్త ఫీచర్లు సమర్థవంతమైన, సేఫ్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. కమ్యూనికేషన్ & ముఖ్యమైన డేటాపై ఎక్కువ కంట్రోల్ కోసం కావాల్సిన సామర్థ్యాన్ని కూడా అందిస్తాయి" అని పేర్కొన్నారు. ట్రూకాలర్ వాయిస్‌లో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని కాంటాక్ట్స్ కనుగొనడానికి వాయిస్ కాల్ లాంచర్ సహాయపడుతుంది. అలానే ఈ ఫీచర్ సాయంతో ఒక్క ట్యాప్‌తో యూజర్లు హెచ్డీ VoIP-బేస్డ్ కాలింగ్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ కోసం పాస్‌కోడ్ లాక్ సెట్ చేసుకోవచ్చు. పాస్‌కోడ్ లాక్ మీ ఎస్ఎంఎస్ డేటాను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు హెల్ప్ అవుతుంది. బయోమెట్రిక్ లేదా ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్న ఫోన్లలో మాత్రమే పాస్‌కోడ్ లాక్ ఫీచర్ పనిచేస్తుంది.
ట్రూకాలర్ కాల్ లాగ్స్‌ను కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు 6400 ఎంట్రీలు చేసుకోవచ్చు. ఇప్పుడున్న వెర్షన్లో 1000 ఎంట్రీలకు మాత్రమే సపోర్టు ఉంది. ఎక్కువ ఎంట్రీలు అందించడం వల్ల బిజినెస్ యూజర్లకు బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఇతర యూజర్లకు కాల్ చేస్తున్నప్పుడు.. వారు ఆ కాల్‌ను లిఫ్ట్ చెయ్యకపోతే.. ఇన్స్టంట్ కాల్ రీజన్‌ను కూడా యాడ్ చేసే అవకాశముంటుంది. "మీతో మాట్లాడొచ్చా?", "ఇది చాలా అర్జెంట్" అనే రీజన్స్‌ను మీరు యాడ్ చేస్తే వారికి కనిపిస్తుంది.
తద్వారా వారు కాల్ లిఫ్ట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ట్రూకాలర్ వీడియో కాలర్ ఐడీ కోసం ఫేస్ ఫిల్టర్లను కూడా లాంచ్ చేస్తుంది. సెల్ఫీ, వర్చువల్ రియాలిటీ (VR) పవర్డ్ ఫిల్టర్ టెంప్లేట్లను బిల్ట్-ఇన్‌గా కూడా అందించనుంది. సెల్ఫీ, వీఆర్ పవర్డ్ ఫిల్టర్లు వీడియో కాలర్ ఐడీని మరింత క్రియేటివ్ గా మారుస్తాయి. కొత్తగా తీసుకొస్తున్న ఈ 5 ఫీచర్లు ప్రజెంట్ జనరేషన్ యూజర్ల అవసరాలకు తగినట్లుగా ఉంటాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.