స్మార్ట్ బ్రాండ్ టెక్నో (Tecno) ఇటీవల ఇండియన్ మార్కెట్‌లోకి వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్ల(Smart phone)ను రిలీజ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్లకు డిమాండ్ బాగుంటుంది. ఇటీవల ఈ కంపెనీ స్పార్క్ 9టీ (Spark 9T) పేరుతో ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మీడియాటెక్ చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన పెద్ద బ్యాటరీ, ట్రిపుల్-కెమెరా(Camera) సెటప్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ కస్టమర్లను ఆకర్షిస్తోంది.
ధర ఎంత?
ఇండియాలో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 9T ఫోన్ 4GB/64GB కాన్ఫిగరేషన్‌లోనే లభిస్తుంది. దీని ధరను కంపెనీ రూ.9,299గా నిర్ణయించింది. లాంచింగ్ ఆఫర్‌గా టెక్నో ప్రస్తుతం ఈ ధరకు ఫోన్‌ను అందిస్తోంది. టెక్నో స్పార్క్ 9T ఫోన్ సేల్స్ ఆగస్టు 6 నుంచి ప్రారంభమవుతాయి. అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు
టెక్నో స్పార్క్ 9T ఫోన్ మీడియాటెక్ హీలియో G35 SoC చిప్‌తో, హైపర్‌ఇంజిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది ఇంటెలిజెంట్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. 3GB వరకు స్టోరేజ్‌ను RAM కెపాసిటీకి విస్తరించుకోవచ్చు.
టెక్నో స్పార్క్ 9T ఫోన్ 6.6-అంగుళాల FHD+ LCD ప్యానెల్‌తో, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, 401 ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డివైజ్ 50 MP ప్రైమరీ సెన్సార్, రెండు ఇతర కెమెరాలతో.. మొత్తం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రట్ నాచ్‌లో 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. టెక్నో స్పార్క్ 9T ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, IPX2 స్ప్లాష్-రెసిస్టెంట్ రేటింగ్, DTS సరౌండ్ సౌండ్ స్పీకర్స్, 4G LTE, బ్లూటూత్ 5.0, GPS, Wi-Fi వంటి మరిన్ని ఫీచర్ల(Features)తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
ఫోన్ ర్యామ్‌ను 7GB RAM వరకు విస్తరించవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు విస్తరించవచ్చు. ఈ డివైజ్ టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ, ఐరిస్ పర్పుల్, తాహితీ గోల్డ్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రూ.10వేల ప్రైస్ రేంజ్‌లో ఇన్ని ఫీచర్లతో వచ్చిన కొత్త టెక్నో ఫోన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Budget smart phone, New features, Tech news