లాక్, అన్‌లాక్... ఫింగర్‌ప్రింట్‌తో వాట్సాప్‌లో కొత్త ఫీచర్...

Lock - Unlock WhatsApp With Fingerprint : ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న వాట్సాప్... తాజాగా ఫింగర్‌ప్రింట్ లాక్ ఫీచర్ తెచ్చింది. వాట్సాప్‌ని ఎవరు బడితే వాళ్లు చూడకుండా ఉండేందుకే... ఈ సెక్యూరిటీ ఫీచర్ తెచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 8:39 AM IST
లాక్, అన్‌లాక్... ఫింగర్‌ప్రింట్‌తో వాట్సాప్‌లో కొత్త ఫీచర్...
వాట్సాప్‌లో అదిరే కొత్త ఫీచర్...
  • Share this:
ఈ రోజుల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాగా... వాట్సాప్ వాడకం కామనైపోయింది. ఐతే... వాట్సాప్‌లో మనం ఎన్నో రహస్యాల్ని షేర్ చేసుకుంటాం. మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, పర్సనల్ ఫొటోలు... ఇలా ఎన్నో పంపుకుంటం. అవి ఇతరులకు తెలిస్తే ప్రమాదమే. అందుకే... వాట్సాప్ కొత్తగా ఫింగర్‌ప్రింట్ లాక్ ఆప్షన్ తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉపయోగించి మనం వాట్సాప్‌ను లాక్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే టచ్ ID అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు అది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఫోన్లలో బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా చెయ్యండి :

- వాట్సాప్ ఓపెన్ చేసి... అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
- ప్రైవసీ ఆప్షన్‌ ఎంచుకోండి. అక్కడ మీరు ఫింగర్‌ప్రింట్ లాక్ ఆప్షన్ చూస్తారు.
- ఫింగర్‌ప్రింట్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి.
- నిమిషంలో లాక్ అవ్వాలో, 30 సెకండ్లలో లాక్ అవ్వాలో సెలెక్ట్ చేసుకోండి.

IOS యూజర్లు ఇలా చెయ్యండి :- యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
- ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోండి.
- స్క్రీన్ లాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టాగుల్ ఆన్ చెయ్యండి. ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ అన్ని వాట్సాప్‌లలో కనిపించదు. ఇది కనిపించాలంటే... వాట్సాప్ పూర్తిగా అప్‌డేట్ అయివుండాలి. చాలా మందికి వాట్సాప్ అప్‌డేట్ చేసిన తర్వాత... మొబైల్‌ను రీబూట్ చేశాకే ఈ ఆప్షన్ కనిపిస్తోంది.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading