Home /News /technology /

TECH TIPS 3 WAYS TO RECORD YOUR PHONE AND WHATSAPP CALLS FULL DETAILS HERE GH VB

WhatsApp Call Recording: వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇంపార్టెంట్ కాల్స్ (phone calls) రికార్డ్ చేయాలని అనుకుంటారు. కానీ కాల్‌లను రికార్డ్ చేసే ఆప్షన్ అందుబాటులో లేక నిరాశకు గురవుతుంటారు. కొంతమంది యూజర్లు వాట్సాప్ ద్వారా కూడా ఎక్కువగా కాల్స్ (WhatsApp calls) చేస్తుంటారు.

ఇంకా చదవండి ...
ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇంపార్టెంట్ కాల్స్ (phone calls) రికార్డ్ చేయాలని అనుకుంటారు. కానీ కాల్‌లను రికార్డ్ చేసే ఆప్షన్ అందుబాటులో లేక నిరాశకు గురవుతుంటారు. కొంతమంది యూజర్లు వాట్సాప్ ద్వారా కూడా ఎక్కువగా కాల్స్ (WhatsApp calls) చేస్తుంటారు. అయితే వీటిని రికార్డ్ చేసేందుకు వాట్సాప్ యాప్‌ ఎలాంటి రికార్డింగ్ ఫీచర్‌ను అందించడం లేదు. దీనివల్ల చాలామంది మొబైల్ యూజర్లు (mobile users) వాయిస్ కాల్స్ రికార్డ్ (voice call record) చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాధారణ ఫోన్ కాల్స్‌తో పాటు వాట్సాప్ కాల్‌లను సులభంగా రికార్డ్ చేయడానికి మూడు టిప్స్ ఫాలో కావాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

టిప్ 1 - ఇన్‌బిల్ట్‌ రికార్డింగ్ ఫీచర్
కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఇన్-బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తాయి. ఇలాంటి ఫోన్లు యూజ్ చేసే వారు థర్డ్-పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా ఇన్-బిల్ట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లోని డిఫాల్ట్ ఫోన్ యాప్ (Phone App)లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ ఉంటుంది. యూజర్లు ఈ యాప్ సెట్టింగ్స్ సెక్షన్‌కి వెళ్లి కాల్ రికార్డింగ్‌ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఇందులో ప్రతి కాల్‌ను మాన్యువల్‌గా రికార్డ్ చేసేలా సెట్ చేయవచ్చు లేదా అన్ని కాల్స్ రికార్డు అయ్యేలా ఆటో-రికార్డింగ్‌ ఆప్షన్ ఆన్ చేయవచ్చు.

Redmi New Mobile: 108 ఎంపీ కెమెరాతో రెడ్​మీ నుంచి కొత్త ఫోన్.. ఫిబ్రవరి 9న భారత మార్కెట్​లోకి.. పూర్తి వివరాలిలా..


వన్‌ప్లస్ ఫోన్ కాల్ రికార్డింగ్‌కు సంబంధించి మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది. మీకు నచ్చిన విధంగా ఈ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. శాంసంగ్ యూజర్లు కూడా డిఫాల్ట్ ఫోన్ యాప్‌ని ఉపయోగించి కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ సెక్షన్‌కి వెళ్లి "రికార్డ్ కాల్స్" పై క్లిక్ చేసి "ఆటో రికార్డ్ కాల్స్" ఆన్ చేస్తే సరిపోతుంది. శాంసంగ్ ఫోన్ తన కాల్ రికార్డ్ ఫీచర్‌లో మాన్యువల్‌, ఆటో-రికార్డింగ్ వంటి మెరుగైన ఫీచర్స్ అందిస్తోంది.

టిప్ 2 - గూగుల్ ఫోన్ యాప్
కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఆఫర్ చేయని స్మార్ట్‌ఫోన్‌ వాడే యూజర్లు చింతించాల్సిన అవసరం లేదు. ఈ తరహా యూజర్లు సింపుల్‌గా ప్లేస్టోర్ నుంచి గూగుల్ ఫోన్ (Phone by Google) యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్‌ని ఓపెన్ చేసి త్రీ డాటెడ్ ఐకాన్ > సెట్టింగ్స్ > కాల్ రికార్డింగ్‌పై నొక్కండి. "ఆల్వేస్ రికార్డ్ (Always record)" కింద సెలెక్టెడ్ నంబర్స్ పై క్లిక్ చేసి> సెలెక్టెడ్ నంబర్స్ టర్న్ ఆన్ చేయండి.

తర్వాత యాడ్ (Add) ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన కాంటాక్ట్ ఎంచుకుని, "ఆల్వేస్ రికార్డ్"ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్‌ను కావలసినప్పుడు మార్చుకోవచ్చు. అయితే ఈ యాప్‌లోని కాల్ రికార్డింగ్‌ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, కాల్ ప్రారంభమయ్యే ముందు కాల్ రికార్డ్ అవుతుందని కాల్‌లో పాల్గొనేవారికి గూగుల్ నోటిఫై చేస్తుంది.

టిప్ 3 - థర్డ్-పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌
పైన చెప్పిన రెండు టిప్స్ వర్క్ అవ్వకపోతే మీరు ప్లేస్టోర్ నుంచి థర్డ్-పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీరు "Cube ACR" యాప్‌ని డౌన్‌లోడ్ చేసినా.. సాధారణ ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్‌లను ఆటోమేటిక్ గా రికార్డ్ చేయవచ్చు. ఈ యాప్ ఆడియో వాయిస్‌ (audio voices)లను రికార్డ్ చేయడానికి రికార్డర్ యాప్‌గా కూడా పని చేస్తుంది. మీరు ఆటో-రికార్డింగ్‌ని కూడా సెట్ చేయవచ్చు. అలాగే కొంతమంది కాలర్‌లను కూడా మినహాయించవచ్చు. కాల్ రికార్డింగ్‌ని మాన్యువల్‌గా ఆన్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

ఇది మీకు కాల్ వచ్చిన ప్రతిసారీ యాప్ కాల్ రికార్డింగ్ విడ్జెట్‌ను ప్రదర్శిస్తుంది. థర్డ్-పార్టీ యాప్స్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఫోన్ సెట్టింగ్‌లలో ఈ యాప్ సేకరించిన పర్మిషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అనంతరం యాప్‌కి అవసరం లేని పర్మిషన్స్ ఇవ్వకుండా మీరు మార్పులు చేయవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు