• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • TECH NOW GOOGLE TAKES STRICT ACTION ON CHINA DELETE MORE THAN 2500 CHINESE YOUTUBE CHANNELS MK

చైనాపై గూగుల్ వార్...2500 చానెల్స్ తొలగించిన యూట్యూబ్

చైనాపై గూగుల్ వార్...2500 చానెల్స్ తొలగించిన యూట్యూబ్

గూగుల్ (Google)కూడా చైనాపై పెద్ద దెబ్బ వేసేందుకు సిద్ధం అయ్యింది. చైనాకు చెందిన 2,500 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానెల్‌లను గూగుల్ తొలగించింది.

గూగుల్ (Google)కూడా చైనాపై పెద్ద దెబ్బ వేసేందుకు సిద్ధం అయ్యింది. చైనాకు చెందిన 2,500 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానెల్‌లను గూగుల్ తొలగించింది.

  • Share this:
    కరోనా మహమ్మారి కారణంగా, ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రముఖ సంస్థలు చైనాకు వ్యతిరేకంగా మారాయి. ఇప్పటికే లడఖ్‌లో హింసాత్మక ఘర్షణల తరువాత, భారత్ చైనాపై కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభి. 59 యాప్‌లను నిషేధించగా, మరో 47 యాప్ లను మళ్లీ నిషేధించారు. ఇప్పుడు గూగుల్ (Google)కూడా చైనాపై పెద్ద దెబ్బ వేసేందుకు సిద్ధం అయ్యింది. చైనాకు చెందిన 2,500 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానెల్‌లను గూగుల్ తొలగించింది.

    చైనీస్ యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా గందరగోళ సమాచారం వ్యాప్తి చెందుతోందని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని గూగుల్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో చైనీస్ యూట్యూబ్ ఛానెల్‌లను గూగుల్ తొలగించింది. ఈ చైనీస్ ఛానెల్‌లను ఏప్రిల్ నుంచి జూన్ మధ్య యూట్యూబ్ నుంచి తొలగించినట్లు గూగుల్ తెలిపింది. చైనాకు సంబంధించిన ఇన్‌ఫ్లూయెన్స్ ఆపరేషన్ల కోసం కొనసాగుతున్న దర్యాప్తులో ఇటువంటి చర్య తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.

    గూగుల్ త్రైమాసిక బులెటిన్లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. యూట్యూబ్ ప్రకారం, సాధారణంగా స్పామ్, రాజకీయేతర కంటెంట్ ఈ ఛానెల్‌లలో పోస్ట్ చేస్తోందని, పేర్కొంది. అయితే వారికి కొన్ని రాజకీయ సమస్యలు కూడా ఉన్నాయి. అయితే, గూగుల్ ఈ ఛానెళ్ల పేర్లను వెల్లడించలేదు, ఇలాంటి కార్యాచరణ ఉన్న వీడియోలకు లింక్‌లు ట్విట్టర్‌లో కనిపించాయని కంపెనీ తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published: