తాజాగా WABetaInfo సమాచారం ప్రకారం.. వాట్సప్ వినియోగదారుకు గూగుల్ షాక్ ఇవ్వనుందని తెలిపింది. ఇకపై వాట్సప్ డేటా స్టోరేజ్ కోటాపై పరిమితి విధించనున్నట్టు సమాచారం. ప్రతీ వాట్సప్ (WhatsApp) యూజర్‌కు పరిమితమైన కోటాను గూగుల్ (Google) అందిస్తుంది. అంతకు మించి వాడుకోవాలంటే చెల్లించాల్సి వస్తుందని సమాచారం. దీంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే వాట్సప్ డేటాను ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ బ్యాక్ ఆప్ చేసుకోచ్చు. అందుకు మీకు కావాల్సిందే RAR వంటి ఫైల్ కంప్రెషన్ యాప్. ఈ పద్ధతిలో మీ వాట్సప్ బ్యాకప్‌ను ఒక ఫోల్డర్‌లో ఆఫ్‌లైన్ (Offline) లో భద్రపరుచుకోవచ్చు. తరువాతో అవసరం అయినప్పుడు దాని వేరే ఫోన్‌లోకి తీసుకెళ్ల వచ్చు. అయితే దీనికి RAR వంటి ఫైల్ కంప్రెషన్ యాప్ తప్పనిసరి అవుతుంది.
WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్.. మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి
ఎలా చేయాలి..
Step 1: - ముందుగా WhatsApp లోపల, హోమ్‌పేజీలోని మూడు-చుక్కల మెను వెళ్లండి. అందులో సెట్టింగ్‌లు/చాట్/చాట్ బ్యాకప్‌కి వెళ్లి, 'బ్యాక్ అప్సపై క్లిక్ చేయండి. అందులో బ్యాకప్ ఆప్షన్‌ను ఇంటర్నల్ స్టోరేజ్ క్లిక్ చేసుకోండి.
Step 2: - గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లోకి వెళ్లి మీ ఫోన్‌లో RAR లేదా ఏదైనా ఇతర ఫైల్ కంప్రెషన్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి. మీకు నచ్చిన కంప్రెషన్ ఫైల్ అప్లికేషన్‌ను వినియోగించుకోవచ్చు.
Step 3: - తరువాత RAR యాప్ లోపల, మీరు మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ (Internal Storage) ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఆండ్రాయిడ్ / మీడియాకు ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో 'com.whatsapp' ఫోల్డర్ కోసం చూడండి. com.whatsapp ఫోల్డర్ పక్కన ఉన్న టిక్ మార్క్‌ని ఎంచుకుని, పైన ఉన్న యాడ్ ఆర్కైవ్ బటన్‌ను నొక్కండి ('+' ఆకారంలో). మొత్తం ఫోల్డర్ ఇప్పుడు .rar ఫైల్‌గా మారుతుంది.
WhatsApp Tips: వాట్సాప్ ఫొటోలు, చాట్ లిస్ట్‌ను ఎలా బ్యాకప్ చేయాలి..? ఆ టిప్స్ మీ కోసం..
Step 4: - ఈ ప్రక్రియలో మీ మొత్తం WhatsApp డేటాను కంప్రెస్ చేయడం చాలా సమయం తీసుకుటుంది. ఎక్కవ సమయం వద్దు అనుకొంటే .zip ఫైల్‌గా మార్చుకోవచ్చు.
Step 5: - తరువాత మీరు WhatsAppని సెటప్ చేయాలనుకుంటున్న కొత్త com.whatsapp.rar ఫైల్‌ని (లేదా మీరు జిప్ చేసి ఉంటే com.whatsapp.zip ఫైల్) మీ కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. కొత్త ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ మీరు పంపిన ఫైల్‌ను అన్‌జిప్ చేయండి. ఈ ఆన్ జిప్ ప్రక్రియలకు మీరు వాడిన ఫైల్ కంప్రెషర్ యాప్ ఉపయోగపడుతుంది.
Step 6: - ఇప్పడు మీరు ఇప్పుడు కొత్త ఫోన్‌లో WhatsAppని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టలేషన్ ప్రక్రియలో Google డిస్క్ బ్యాకప్ ఆప్షన్‌ను స్కిప్ చేయండి. తరువాత మీ ఇంటర్నల్ బ్యాకప్‌ను ఎంచుకొని ఎంచుకొని మీ ఇన్‌స్టలేషన్ ప్రాసెస్‌ను కొనసాగించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Latest Technology, Whatsapp