Home /News /technology /

TECH MAHINDRA USING AUTO RICKSHAWS TO CAPTURE MAPPING DATA FOR GOOGLE STREET VIEW FEATURE IN INDIA SS

Camera on Auto: ఇలాంటి ఆటోలు మీకు కనిపించాయా? ఆటోపై ఈ కెమెరాలు ఎందుకో తెలుసా?

Camera on Auto: ఇలాంటి ఆటోలు మీకు కనిపించాయా? ఆటోపై ఈ కెమెరాలు ఎందుకో తెలుసా?
(image: anandmahindra / Twitter)

Camera on Auto: ఇలాంటి ఆటోలు మీకు కనిపించాయా? ఆటోపై ఈ కెమెరాలు ఎందుకో తెలుసా? (image: anandmahindra / Twitter)

Camera on Auto | భారతీయ రోడ్లపై తిరుగుతున్న కొన్ని ఆటోలపై కెమెరాలు కనిపిస్తున్నాయి. పైన ఓ ట్రైపాడ్, దానికి ఓ కెమెరా అమర్చుకొని ఆటోలు తిరుగుతున్నాయి. ఈ ఆటోలు ఎందుకు తిరుగుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది.

మీరు రోడ్డుపై వెళ్తుంటో ఆటోపై కెమెరాలు కనిపించాయా? ఆటో పైన ట్రైపాడ్, దానికి ఓ కెమెరా ఉన్నట్టు చూశారా? ఆటోలపై ఈ కెమెరాలు ఎందుకన్న డౌట్ మీకు వచ్చిందా? ఆ ఆటోలు గూగుల్ మ్యాప్స్‌కు (Google Maps) మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసి ఇస్తున్నాయి. ఇటీవల ఇండియాలో గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ (Google Maps Street View) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసింది. భారతదేశంలో స్ట్రీట్ వ్యూ సేవల్ని అందించేందుకు గూగుల్ మ్యాప్స్... జెనిసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ 11 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా, ప్రభుత్వ రెగ్యులేషన్స్ కారణంగా భారతదేశానికి చాలా ఆలస్యంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అమెరికా వీధుల మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసేందుకు కార్లపై కెమెరాలు ఉంటాయి. కానీ ఇండియాలో ఖర్చు తగ్గించుకునేందుకు టెక్ మహీంద్రా ఇలా వినూత్నంగా ఆలోచించింది. మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసేందుకు ఆటోలపై కెమెరాలను అమర్చింది. ఆ ఆటోలు రోడ్లు, వీధుల్లో తిరుగుతూ మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేస్తుంటాయి. గూగుల్‌కు లైసెన్స్ స్ట్రీట్ వ్యూ డేటా అందించేందుకు టెక్ మహీంద్రా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా లాజిస్టిక్స్ ఇలా మహీంద్రా ఆటోలను ఉపయోగిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రీ ట్వీట్ చేశారు.

Mobile Offer: తొలిసారి రూ.10,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ సేల్... 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ


అయితే అన్ని రూట్లల్లో ఆటోలనే ఉపయోగిస్తున్నారా అన్న వివరాలైతే ప్రస్తుతానికి లేవు. భారతీయ రోడ్ల పరిస్థితులు, ప్రాంతాలను బట్టి మహీంద్రా లాజిస్టిక్స్ వేర్వేరు వాహనాలను ఉపయోగిస్తూ ఉండవచ్చు. గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 10 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ స్ట్రీట్ వ్యూ సేవలు లభిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే మొత్తం 1,50,000 కిలోమీటర్ల దూరాన్ని స్ట్రీట్ వ్యూ కవర్ చేయనుంది. 2022 చివరి నాటికి 50 నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

iPhone Offer: రెడ్‌మీ, రియల్‌మీ సాంసంగ్ ధరకే ఐఫోన్... ఆఫర్ ధర రూ.25,000 లోపే


గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉపయోగించండి ఇలా


ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సెర్చ్ చేయాలి.
ఏదైనా ప్రాంతాన్ని సెర్చ్ చేస్తే ఆ ఏరియా మ్యాప్ కనిపిస్తుంది.
మీరు చూడాలనుకుంటున్న ఏరియా పిన్ చేయాలి.
ఆ ఏరియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ కనిపిస్తే ఆ ఐకాన్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి.
ఆ తర్వాత ఆ ఏరియా స్ట్రీట్ వ్యూలో కనిపిస్తుంది. ముందుకు వెనక్కి డ్రాగ్ చేస్తూ మ్యాప్ చూడొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Anand mahindra, Google, Google Maps, Mahindra and mahindra, Tech Mahindra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు