స్పామ్ కాల్స్‌పై మైక్రోసాఫ్ట్‌, టెక్ మహీంద్రా యుద్ధం

దేశంలో ఫోన్లు వాడేవారందరికీ స్పామ్ కాల్స్ అతిపెద్ద సమస్య. ఈ విషయం ధృవీకరించింది ఎవరో కాదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియానే. ఈ సమస్యను పరిష్కరించేందుకు దిగ్గజ కంపెనీలతో చేతులు కలిపింది ట్రాయ్.

news18-telugu
Updated: August 27, 2018, 4:29 PM IST
స్పామ్ కాల్స్‌పై మైక్రోసాఫ్ట్‌, టెక్ మహీంద్రా యుద్ధం
(Image: Reuters)
  • Share this:
స్పామ్ కాల్ భూతంపై టెక్ కంపెనీలు యుద్ధం ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్‌తో కలిసి బ్లాక్‌చెయిన్ పద్ధతిలో ఈ సమస్యను ఎదుర్కొంటామని సాఫ్ట్‌వేర్ దిగ్గజం టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ రెండు టెక్ కంపెనీలతో ట్రాయ్ కూడా చేతులు కలుపుతోంది. "స్పామ్ కాల్స్, మోసపూరిత చర్యల్ని ఎదుర్కోవడానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఓ శక్తివంతమైన ఆయుధం. ఇది టెలికాం సెక్టార్‌లో భాగం కూడా. రిజిస్టర్ చేసుకోని టెలికాం మార్కెటర్ల ఆర్థిక మోసాలు, ఆర్థికపరమైన తప్పుడు సమాచారవ్యాప్తిని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అడ్డుకోగలదు" అని బ్లాక్ చెయిన్ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేష్ దుద్దు చెబుతున్నారు.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా సంబంధిత వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, టెలిమార్కెటర్లు ట్రాయ్ నియమనిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నాయి టెక్ కంపెనీలు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ బ్లాక్ చెయిన్ ద్వారా మోసగాళ్ల లొసుగుల్ని బయటపెట్టొచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

#మొబైల్ యాప్: ఎమ్మెల్యేలు, ఎంపీలకు యాప్‌లో రేటింగ్!యూట్యూబ్‌లో యాడ్స్ స్కిప్ చేయలేరు!

చిప్ లేదా... ఎస్‌బీఐ కార్డు మార్చుకోవాల్సిందే!

 
First published: August 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు