TEANEGER BOUGHT IPHONE 7 THROUGH ONLINE E COMMERCE SITE HE RECEIVED A TABLE LOOKS LIKE IPHONE NK
iPhone: ఆన్లైన్లో ఐఫోన్ కొన్నాడు... డెలివరీ వచ్చింది చూసి ఫ్యూజులు పోయాయ్...
iPhone: ఆన్లైన్లో ఐఫోన్ కొన్నాడు... డెలివరీ వచ్చింది చూసి ఫ్యూజులు పోయాయ్... (image credit - twitter)
Online order: ఈ రోజుల్లో మనం చాలా వస్తువులు ఆన్లైన్లో కొంటున్నాం. మనల్ని అలర్ట్ చేసే న్యూస్ ఇది. ఆ పిల్లాడు ఎలా మోసపోయాడంటే... మామూలుగా లేదు ఆ స్కెచ్.
మీకు తెలుసు... ఐఫోన్ కొనాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైనే ఉంటుంది. అదిరిపోయే ఫీచర్లతో ఉండే ఆ ఫోన్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టం. క్యూ కట్టి మరీ కొనుక్కుంటారు. ఐతే... బయటి షాపుల్లో కంటే... ఒక్కోసారి ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో మొబైల్స్ తక్కువ రేటుకు లభిస్తాయి. కొన్నిసార్లు అదిరిపోయే ఆఫర్లు కూడా ఉంటాయి. అందువల్ల చాలా మంది ఆఫర్లకు ఎట్రాక్ట్ అయ్యి... ఫోన్లు కొంటుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. థాయిలాండ్‌లో జరిగిన ఘటన మాత్రం షాక్ ఇస్తోంది. ఓ టీనేజర్... ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లో ఐఫోన్ ఫొటో చూశాడు. దాని రేటు తక్కువే ఉంది. తెగ ఆనందపడిపోయాడు. "ఎంతో రేటు ఉండే ఐఫోన్... ఇంత తక్కువ రేటుకి లభిస్తోందా... నక్క తోకను నాలుగైదు సార్లు తొక్కినట్లున్నా" అనుకుంటూ... గబగబా ఆర్డర్ ఇచ్చాడు. కరోనా కాబట్టి... ముందే డబ్బు చెల్లించాలని చెప్పారు. వాక్కే అంటూ వెంటనే డబ్బు కూడా చెల్లించాడు. ఇక ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం మొదలుపెట్టాడు.
నాలుగు రోజుల తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు. టీనేజర్ పేరు, అడ్రెస్ చెక్ చేసుకొని... తన సంచి లోంచీ ఓ భారీ ఐటెం పైకి తీశాడు. అది చూసిన కుర్రాడు... "సారీ... అది నాది కాదు. అంత పెద్ద ఐటెం నేను ఆర్డర్ ఇవ్వలేదు. నేను ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాను." అన్నాడు. వెంటనే డెలివరీ బాయ్... "అవును బాసూ... ఇదే నువ్వు ఆర్డర్ ఇచ్చింది... దీనిపై టైటిల్ చూడు... ఐఫోన్" అంటూ ఆ భారీ ఐటెమ్‌ని అతని చేతిలో పెట్టి తుర్రున వెళ్లిపోయాడు.
దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లిన పిల్లాడు ఓపెన్ చేసి చూస్తే... అది కాఫీ టేబుల్. చూడ్డానికి మాత్రం ఐఫోన్ ఆకారంలో ఉంది. అది చెక్క టేబుల్ కాబట్టే... తక్కువ ధర ఉంది. కానీ... ఆ టేబుల్‌ను ఆన్లైన్ సైట్లో అచ్చం ఐఫోన్ లాగా ఫొటో తీసి పెట్టారు. దాంతో... ఆ టీనేజర్ బుక్కయ్యాడు. ఈ ఐటెం డెలివరీకి షిప్పింగ్ ఛార్జీలు కూడా ఎక్కువగానే తీసుకున్నారని పిల్లాడు చెప్పాడు.
iPhone: ఆన్లైన్లో ఐఫోన్ కొన్నాడు... డెలివరీ వచ్చింది చూసి ఫ్యూజులు పోయాయ్... (image credit - twitter)
చివరకు ఏమైంది... ఐటెం రిటర్న్ ఇచ్చేశాడా అన్నది మనం చెప్పుకోవాల్సిన అంశం. ఆ పిల్లాడు తాను మోసపోయానని గ్రహించాడు. కానీ... ఎందుకో ఆ టేబుల్ తనకు నచ్చిందట... సర్లే అని రిటర్న్ ఇవ్వకుండా ఉంచేసుకున్నాడు. తనలా మరెవ్వరూ మోసపోవద్దని చెబుతూ... సోషల్ మీడియాలో విషయాన్ని సింపుల్‌గా చెప్పాడు. అదీ మ్యాటర్. ఈ స్టోరీ మనకో హెచ్చరిక లాంటిదే. మనం వస్తువులు ఆన్లైన్లో కొనేటప్పుడు వాటి సైజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.