TCL Smartphone: టీసీఎల్ నుంచి స‌రికొత్త స్మార్ట్‌ఫోన్... ఫోల్డ్ చేయొచ్చు... రోల్ చేయొచ్చు

TCL Smartphone: టీసీఎల్ నుంచి స‌రికొత్త స్మార్ట్‌ఫోన్... ఫోల్డ్ చేయొచ్చు... రోల్ చేయొచ్చు

TCL Smartphone: టీసీఎల్ నుంచి స‌రికొత్త స్మార్ట్‌ఫోన్... ఫోల్డ్ చేయొచ్చు... రోల్ చేయొచ్చు (image: TCL)

TCL Smartphone | టీసీఎల్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మడతపెట్టొచ్చు. రోల్ కూడా చేయొచ్చు.

  • Share this:
ఇప్ప‌టి వ‌ర‌కూ మార్కెట్లో ఎన్నో ఫోన్లు వైవిధ్యమైన డిజైన్ల‌తో ఆక‌ట్టుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ రోలింగ్ మోడ‌ల్స్‌ని, ఫోల్డింగ్ మోడ‌ల్స్‌ని చూశాము. కానీ రెండూ ఒకే ఫోన్‌లో ఉన్న స‌రికొత్త డిజైన్ ఫోన్ల‌ను మ‌నం చూడ‌లేదు. స‌రిగ్గా ఈ కాన్సెప్ట్‌తోనే టిసిఎల్ అంద‌ర్నీ ఆకర్షిస్తోంది. మొద‌ట్లో ఉన్న ఐప్యాడ్ కంటే స‌న్న‌ని డిజైన్ తో ఫోన్లు ఇప్పుడు వ‌స్తూనే ఉన్నాయి. కానీ ఇంకా ఏదో కొత్త‌ద‌నం కావాలి. మ‌నిషికి ప్ర‌తిరోజూ కొత్త‌గా ఉంటే బాగుంటుందని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అందుకే మార్కెట్లో మ‌రింత ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫోన్ల‌ను తీసుకురావ‌డానికి మొబైల్ ఫోన్ కంపెనీల‌న్నీ త‌ల‌మున‌క‌ల‌వుతుంటాయి. త‌మ కంపెనీ పేరు క‌ల‌కాలం కాసుల వ‌ర్షం కురిపించాల‌ని కోరుకుంటాయి.

WhatsApp Privacy Policy: మే 15 డెడ్‌లైన్... వాట్సప్ ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏమవుతుందో తెలుసా?

iPhone: ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ ఐఫోన్ వచ్చింది

ఈ కోవ‌లోనే శామ్‌సంగ్ (SAMSUNG) గెలాక్సీ Z ఫోల్డ్ 1, త‌ర్వాత వ‌చ్చిన‌ 2 డివైజ్‌లు మెయిన్ స్ట్రీమ్‌లోకి ఫోల్డ్ చేసే డిజైన్ల‌తో ఫోన్ల‌ను తీసుకొచ్చాయి. వీళ్ల Z ఫోల్డ్ డివైజ్ ఫిబ్ర‌వ‌రి 2020లో రిలీజ్ అయ్యింది. ఇక ఆల్ టైమ్ క్లాసిక్ ఫ్లిప్ ఫోన్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న మోటో రేజ‌ర్ స‌రికొత్త మోడ‌ర్న్ స్మార్ట్ ఫోన్‌గా రీలాంఛ్ అయ్యింది. ఇది రోలింగ్ స్క్రీన్ మోడ‌ల్‌లో వ‌చ్చింది. స‌గం సైజులో అది రోల్ అవుతుంది. గ‌త సంవ‌త్స‌రం ఒప్పో ( OPPO) కూడా రోలింగ్ డిజైన్‌తో ఫోన్ విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పో X డివైజ్‌ల‌లో స్క్రీన్ వెడ‌ల్పు అవుతుంది. ఇక ఎడ‌మ నుంచి కుడికి జ‌రిపేదాన్ని బ‌ట్టి మీరు రోల్ చేయడం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి మోడ‌ల్స్ కంటే వైవిధ్యంగా ఇప్పుడు టిసిఎల్ కొత్త ఆలోచ‌న చేసింది.

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

టిసిఎల్ (TCL) ఫోల్డింగ్ డిజైన్ ‌లో స‌రికొత్త‌ ఆలోచ‌న చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ‌కు జాయింట్ లాంటి ప‌రిక‌రం ఉండ‌టం వ‌ల్ల దీన్ని గుండ్రంగా తిప్పవ‌చ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ఉండ‌టం వ‌ల్ల మ‌డ‌త‌ పెట్ట‌వ‌చ్చు. ఈ 10 అంగుళాల స్మార్ట్ ట్యాబ్లెట్‌ భ‌ద్రంగా కేసింగ్‌లో ఉంటుంది. స్టాండ‌ర్డ్‌ను బ‌ట్టి ఇది 6.8 అంగుళాల స్క్రీన్‌. టిసిఎల్ ప్ర‌త్య‌క్షంగా షేర్ చేసిన వీడియో ద్వారా ఇందులో స్టైలస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శామ్‌సంగ్ ఎస్‌-పెన్ లాగానే ఇది కూడా ఇన్‌బిల్ట్ స్టైల‌స్‌ను క‌లిగి ఉంటుంది. ఒకేసారి స్క్రిబుల్‌, డూడుల్ చేయ‌డాన్ని, నోట్స్ తీసుకోవ‌డాన్ని‌ ఈ స్టెల‌స్ సుల‌భ‌త‌రం చేస్తుంది.

అయితే ఇది కేవలం ఒక డివైజ్ కి సంబంధించిన వార్త మాత్రమే. ఈ పరికరం ఎప్పుడు విడుదలవుతుంది. తయారైందా? దీనికి సంబంధించిన ఉత్పత్తి మొదలైందా? వంటి వివరాలపై స్పష్టత లేదు. ఏదేమైనా, ఈ ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గేమ్ ఛేంజ‌ర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు