TCL Smart TV: టీసీఎల్ నుంచి మూడు స్మార్ట్‌ టీవీలు... ధర ఎంతో తెలుసా?

TCL Smart TV | కేవలం టీవీ చూడటం మాత్రమే కాదు స్మార్ట్‌హోమ్‌గా మార్చేయొచ్చు. ఫ్యాన్, రోబో స్వీపర్స్, కర్టైన్స్, లైట్స్ లాంటివాటిని టీవీ నుంచే కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్ అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టీవీ ఆపరేట్ చేయొచ్చు.

news18-telugu
Updated: August 3, 2019, 9:18 AM IST
TCL Smart TV: టీసీఎల్ నుంచి మూడు స్మార్ట్‌ టీవీలు... ధర ఎంతో తెలుసా?
TCL Smart TV: టీసీఎల్ నుంచి మూడు స్మార్ట్‌ టీవీలు... ధర ఎంతో తెలుసా?
  • Share this:
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? చైనాకు చెందిన కంపెనీ టీసీఎల్ పీ8 సిరీస్‌లో మూడు టీవీలను రిలీజ్ చేసింది. మొదటి 4K AI Android P 9.0 TV ఇండియాకు తీసుకొచ్చింది. పీ8 సిరీస్ టీవీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయడం విశేషం. దాంతోపాటు గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ పై 9.0 యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది ఈ టీవీలో. భారతీయ యూజర్లకు టీవీ వీక్షించే అనుభవాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందని చెబుతోంది కంపెనీ. P8S టీవీ 65, 55 అంగుళాల్లో, P8E టీవీ 55, 50, 43 అంగుళాల్లో, P8 టీవీ 43, 50, 55 అంగుళాల్లో లభిస్తుంది. P8 మోడల్ టీవీ ధర రూ.27990, P8E మోడల్ ధర రూ.29990, P8S మోడల్ ధర రూ.44990 నుంచి ప్రారంభమవుతుంది.

కేవలం టీవీ చూడటం మాత్రమే కాదు స్మార్ట్‌హోమ్‌గా మార్చేయొచ్చు. ఫ్యాన్, రోబో స్వీపర్స్, కర్టైన్స్, లైట్స్ లాంటివాటిని టీవీ నుంచే కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్ అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టీవీ ఆపరేట్ చేయొచ్చు. ఇక క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేవారికి స్పోర్ట్ మోడ్ ఫీచర్ ప్రత్యేకంగా ఉంది. టీసీఎల్ స్మార్ట్‌టీవీల్లో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ ఉంటాయి. హాట్‌స్టార్, యప్‌టీవీ, వూట్, ఆల్ట్‌బాలాజీ లాంటి స్ట్రీమింగ్ సర్వీసులు కూడా చూడొచ్చు. ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు లాంఛ్ చేసిన టీసీఎల్... ఇప్పుడు సరికొత్త టీవీలతో టెలివిజన్ రంగంలో పోటీలో నిలువబోతోంది.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Jio-Dineout: డైన్‌అవుట్ ఫెస్టివల్‌లో జియో యూజర్లకు ఆఫర్లు

New Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా... కొత్త ఫైన్స్ ఇవే
Loading...
WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?
First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...