Home /News /technology /

TCL LAUNCHES 4 TABLETS PRICE STARTING AT RS 15999 KNOW SPECIFICATIONS SS GH

TCL Tablets: టీసీఎల్ నుంచి నాలుగు ట్యాబ్లెట్స్ విడుదల... ధర రూ.15,999 నుంచి

TCL Tablets: టీసీఎల్ నుంచి నాలుగు ట్యాబ్లెట్స్ విడుదల... ధర రూ.15,999 నుంచి
(image: TCL)

TCL Tablets: టీసీఎల్ నుంచి నాలుగు ట్యాబ్లెట్స్ విడుదల... ధర రూ.15,999 నుంచి (image: TCL)

TCL Tablets | ఆన్‌లైన్ క్లాసులు, వీకెండ్‌లో సినిమాల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? టీసీఎల్ నాలుగు ట్యాబ్లెట్స్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్​ టీసీఎల్ నుంచి ఒకేసారి నాలుగు సరికొత్త ట్యాబ్​లు విడుదలయ్యాయి. 10 ట్యాబ్ మ్యాక్స్ 4 జి, 10 ట్యాబ్ మాక్స్ (వై-ఫై), 10 ట్యాబ్ 4 జి (ఎఫ్‌హెచ్‌డి), 10 ట్యాబ్ 10 ఎస్ (వై-ఫై) పేర్లతో ఇవి భారత మార్కెట్​లోకి లాంచ్ అయ్యాయి. బడ్జెట్​ ధరలోనే వీటిలో అద్భుతమైన ఫీచర్లను అందించింది. టీసీఎల్ 10 ట్యాబ్ మాక్స్ 4జి.. రూ. 20,999 ధర వద్ద విడుదలవ్వగా.. దీని వై-ఫై వేరియంట్​ రూ. 18,999 వద్ద విడుదలైంది. టీసీఎల్ ట్యాబ్ 10 4జి ఎఫ్‌హెచ్‌డి మోడల్ రూ. 16,999 ధర వద్ద విడుదలవ్వగా.. టీసీఎల్ ట్యాబ్ 10 ఎస్ (వై-ఫై) వేరియంట్​ రూ. 15,999 ధర వద్ద లభిస్తుంది. ఇవి బ్లూ, గ్రే కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. రేపటి (జూలై 24) నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

టీసీఎల్​ 10 ట్యాబ్ మాక్స్ 4జి, టీసీఎల్ 10 ట్యాబ్ మాక్స్ (వై-ఫై) స్పెసిఫికేషన్లు


టీసీఎల్ 10 ట్యాబ్ మాక్స్ 4 జి, వై-ఫై వేరియంట్ రెండు మోడల్స్​లోనూ నెట్‌వర్క్ కనెక్టివిటీ మినహా మిగతా అన్ని ఫీచర్లు ఒకే రకంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఆండ్రాయిడ్ 10 ఓఎస్​ను అందించారు. ఇవి10.36 -అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ (2,000x1,200 పిక్సెల్‌లు) డిస్​ప్లేతో వస్తాయి. టీసీఎల్ 10 ట్యాబ్ మాక్స్ మోడల్స్ ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్​తో పనిచేస్తాయి. వీటిలో 64 జిబి స్టోరేజ్​ వరకు విస్తరించగలిగే మైక్రో ఎస్డీ కార్డ్, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్​ను అందించారు.

Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Samsung Galaxy A22 5G: సాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్... గెలాక్సీ ఏ22 ప్రత్యేకతలివే

ఇక కెమెరా విషయానికొస్తే, వీటి వెనుకవైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్​ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్​ కెమెరాలను చేర్చింది. వై-ఫై, బ్లూటూత్ వి 5, యూఎస్​బి టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందించింది. టీసీఎల్ 10 ట్యాబ్ మాక్స్ 4 జి సింగిల్ సిమ్ 4 జి సపోర్ట్‌తో వస్తుంది. ఇక, దీనిలో10W ఛార్జింగ్‌కు సపోర్ట్​ ఇచ్చే 8,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

టీసీఎల్​ ట్యాబ్​ 10 4G FHD స్పెసిఫికేషన్లు


టీసీఎల్ ట్యాబ్ 10 4 జి ఎఫ్‌హెచ్‌డి కూడా ఆండ్రాయిడ్ 10 ఓఎస్​తో నడుస్తుంది. ఇది 10.1-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్, (1,920x1,200 పిక్సెల్స్) డిస్​ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ MT8768E SoC ప్రాసెసర్​తో పని చేస్తుంది. దీనిలో 3GB RAM, 64GB స్టోరేజ్ అందించారు. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 256GB వరకు విస్తరించవచ్చు. దీని వెనుక భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక, కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. దీనిలో ఛార్జింగ్ కోసం వై-ఫై, 4 జి, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి అందించింది. 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది.

Oneplus Nord 2 vs Oneplus Nord CE: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఏంటీ? తెలుసుకోండి

Asus Chromebook: రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలైంది

టీసీఎల్​ ట్యాబ్ 10s (Wi-Fi) స్పెసిఫికేషన్లు


టీసీఎల్ ట్యాబ్​ 10 ఎస్ 10.1- అంగుళాల ఫుల్ హెచ్​డి ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 3GB ర్యామ్​, 32GB స్టోరేజ్​తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను​ 256 జీబీ వరకు విస్తరించవచ్చు. దీని వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించింది. ఇక, కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. దీనిలో వై-ఫై, బ్లూటూత్ వి 5, యూఎస్​బి టైప్-సి పోర్టు వంటివి చేర్చింది. 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 8WmAh బ్యాటరీని అందించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Tablet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు