Home /News /technology /

TCL LAUNCHES 3 SMART TVS WITH 4K RESOLUTION 144HZ REFRESH RATE STARTING AT RS 35990 UMG GH

TCL Smart TVs: ఇండియన్ మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌టీవీలు.. బెస్ట్ టీవీలను లాంచ్ చేసిన టీసీఎల్

స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన టీసీఎల్

స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన టీసీఎల్

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ TCL నుంచి తాజాగా మూడు కొత్త స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. 4K రిజల్యూషన్‌తో TCL C835: న్యూ జనరేషన్ మినీ LED 4K Google TV 144Hz VRR; TCL C635 గేమింగ్ QLED 4K TV, TCL P735 4K HDR గూగుల్ TVలను కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

ఇంకా చదవండి ...
ఇండియన్ స్మార్ట్‌టీవీ మార్కెట్ ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. టీవీ వ్యూయర్లు ఇప్పుడు బెస్ట్ క్వాలిటీతో వస్తున్న స్మార్ట్ టీవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ధోరణి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మార్కెట్ డిమాండ్‌ను అందింపుచ్చుకునేందుకు సరికొత్త స్మార్ట్‌టీవీలను వరుసగా రూపొందిస్తోంది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ TCL. ఈ కంపెనీ నుంచి తాజాగా మూడు కొత్త స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. 4K రిజల్యూషన్‌తో TCL C835: న్యూ జనరేషన్ మినీ LED 4K Google TV 144Hz VRR; TCL C635 గేమింగ్ QLED 4K TV, TCL P735 4K HDR గూగుల్ TVలను కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

TCL C835 న్యూ జనరేషన్ మినీ LED 4K Google TV మోడల్.. 144Hz VRRతో వచ్చిన టాప్-ఎండ్ వేరియంట్. దీని 55-అంగుళాల, 65-అంగుళాల, 75-అంగుళాల వేరియంట్ ధరలు వరుసగా రూ. 1,19,990, రూ. 1,59,990, రూ. 2,29,990గా ఉన్నాయి. ఈ మోడల్ 144Hz VRR, ONKYO, డాల్బీ విజన్ IQ, డాల్బీ అట్మోస్, HDR 10+, MEMC, HDMI 2.1 వంటి టాప్ ఎండ్ ఫీచర్లతో వస్తుంది. గేమింగ్ లవర్స్ కోసం దీంట్లోని 144Hz VRR బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇది గూగుల్ TV సపోర్ట్‌తో వస్తుంది.

TCL C635 గేమింగ్ QLED 4K TV 120Hz DLG మోడల్ గేమ్ మాస్టర్. ఇది వైడ్ కలర్ గామట్, 4K HDR, MEMC (మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్)తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్‌ సపోర్ట్‌తో వస్తుంది. TCL C635లోని కొత్త HDR 10+ టెక్నాలజీ.. బెస్ట్ క్వాలిటీ పిక్చర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. కాంట్రాస్ట్‌లో ఫ్రేమ్-టు-ఫ్రేమ్ వేరియేషన్స్‌ రిఫ్లెక్ట్ చేసేందుకు డైనమిక్ టోన్ మ్యాపింగ్‌ను ఉపయోగిస్తూ 4K డిస్‌ప్లే కోసం ఇమేజ్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ డివైజ్ ONKYO సౌండ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీంట్లోని డాల్బీ అట్మోస్ సిస్టమ్.. ఆడియో అవుట్‌పుట్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. TCL C635 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 44,990, రూ. 54,990, రూ. 64,990, రూ. 85,990, రూ. 149,990గా ఉన్నాయి.

TCL నుంచి వచ్చిన మూడో మోడల్ P735 4K HDR Google TV. ఇది వైడ్ కలర్ గామట్, HDR 10 ప్రొఫెషనల్ ఆడియోవిజువల్స్‌ను అందిస్తుంది. ఇందులో MEMC మోషన్ పిక్చర్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉంటుంది. TCL P735 డివైజ్‌లోని HDMI 2.1.. హై రిజల్యూషన్‌ వీడియోలు, ఫాస్టెస్ట్ రిఫ్రెష్ రేట్‌లకు సపోర్ట్ చేస్తుంది. TCL P735 టీవీ ALLM ఆప్టిమైజేషన్‌ను కలిగి ఉంది. మంచి గేమ్‌ప్లేను అందించడానికి ఆటోమెటిక్‌గా లో-లాగ్ ప్రీసెట్‌లకు మారుతుంది. TCL P735 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 35,990, రూ. 41,990, రూ. 49,990, రూ.69,990.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా అన్ని కొత్త సిరీస్‌లపై ప్రీ-బుకింగ్ ఆఫర్ ఉంది. దీంతోపాటు రూ. 10,990 విలువైన సౌండ్ బార్‌ను, రూ. 2999 విలువైన వీడియో కాల్ కెమెరాను ఉచితంగా పొందవచ్చు. SBI కస్టమర్లు గరిష్టంగా 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్, క్రోమాలో అందుబాటులో ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Android TV, Budget smart tv, Smart TV, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు