Honda Electric Scooter | కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా పెద్ద స్క్రీన్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే మీకు భారీ ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీని (Smart TV) సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. టీసీఎల్ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తోంది.
టీసీఎల్ సీ815 సిరీస్ 55 ఇంచుల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ. 1,89,990గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 49,990కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొంటే మీకు అదనంగా రూ. 1250 వరకు తగ్గింపు వస్తుంది.అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
రూ.26కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ .. రిపబ్లిక్ డే బంపరాఫర్, మిస్ అవ్వొద్దు!
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై మరో ఆఫర్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. ఏకంగా రూ. 16,900 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందొచ్చు. అంటే అప్పుడు మీకు దాదాపు రూ. 33 వేలకు ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. ఈ టీవీపై కంపెనీ 2 ఏళ్ల వరకు వారంటీ అందిస్తోంది. అన్ని రకాల ఓటీటీ యాప్స్ సపోర్ట్ ఉంటుంది. సౌండ్ ఔట్ పుడ్ 50 వాట్. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్.
ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. రీచార్జ్ ధరలు భారీగా పెంచేసిన కంపెనీ!
ఇకపోతే మీరు ఈ టీవీని తక్కువ ఈఎంఐ ఆప్షన్‌లో కొనొచ్చు. నెలకు రూ. 1700 ఈఎంఐ కడితే చాలు ఈ 4కే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. 36 నెలల ఈఎంఐకు ఇది వర్తిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే 24 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2424 కట్టాలి. 18 నెలల ఈఎంఐ అయితే రూ. 3,119 పడుతుంది. ఇక 12 నెలలు అయితే నెలకు రూ. 4512 చెల్లించాలి. 9 నెలల ఈఎంఐ అయితే రూ. 5908 కట్టాల్సి ఉంటుంది. అదే ఆరు నెలల ఈఎంఐ అయితే రూ. 8700 చెల్లించాలి. మూడు నెలల ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. నెలకు రూ. 17082 పడుతుంది. క్రెడిట్ కార్డు ప్రతిపాదికన నెల వారీ ఈఎంఐ మొత్తంలో కొంత మేర తేడా ఉండొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android TV, Budget smart tv, Flipkart, Smart TV