హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tata Tiago NRG XT: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? టాటా న్యూ కార్ ట్రై చేయండి.. ధర కూడా చాలా తక్కువే..!

Tata Tiago NRG XT: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? టాటా న్యూ కార్ ట్రై చేయండి.. ధర కూడా చాలా తక్కువే..!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? టాటా న్యూ కార్ ట్రై చేయండి..

కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? టాటా న్యూ కార్ ట్రై చేయండి..

టాటా మోటార్స్ Tiago NRG సిరీస్‌లో కొత్త XT వేరియంట్‌ను 6.42 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Tiago XT NRG, Tiago XZ NRG అనే రెండు వేరియంట్‌లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టాటా మోటార్స్ నుంచి వచ్చే కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏడాది క్రితం టాటా మోటార్స్ నుంచి వచ్చిన 2021 టియాగో NRG వెర్షన్ మంచి స్పందన దక్కించుకుంది. ఆ మోడల్ వార్షికోత్సవం సందర్భంగా టియాగో NRG వెర్షన్‌లో మరో మోడల్ మన ముందుకొచ్చింది. టాటా మోటార్స్ Tiago NRG సిరీస్‌లో కొత్త XT వేరియంట్‌ను 6.42 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Tiago XT NRG, Tiago XZ NRG అనే రెండు వేరియంట్‌లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది.

టాటా టియాగో NRG XT మోడల్.. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది, అయితే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వాటితో పాటు 3.5-అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. రగ్డ్ క్లాడింగ్స్, రూఫ్ టైల్స్‌తో కూడిన ఇన్ఫినిటీ బ్లాక్ రూఫ్ ఇంకా చార్‌కోల్ బ్లాక్ ఇంటీరియర్‌ అంతా మనకు గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన NRG వేరియంట్లో ఉన్నట్టే ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 181mm. టాటా మోటార్స్ ప్రస్తుతమున్న టియాగో ఎక్స్‌టి వేరియంట్ లైనప్‌ను టియాగో ఎన్‌ఆర్‌జి ఎక్స్‌టి మాదిరిగానే కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఫీచర్లు Tiago XT, XTA మరియు XT iCNGతో సహా XT పరిధిలో అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


కొనుగోలుదారులు ముప్ఫై వేల రూపాయలు అదనంగా చెల్లించి Tiago XTతో రిథమ్ ప్యాక్‌ని కూడా పొందవచ్చు. ఈ రిథమ్ ప్యాకేజీలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక కెమెరా, 4 ట్వీటర్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. XT వేరియంట్‌లో ఇప్పటికే ఉన్న ఒపాల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ, ఫ్లేమ్ రెడ్ కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్త మిడ్‌నైట్ ప్లమ్ కలర్‌ను కూడా అందించింది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఆహ్లాదంగా మార్చడం, ఆకర్షణీయమైన ధరలో అందించడమే ప్రధానంగా ఈ మోడల్‌ని తీసుకొచ్చారు. టియాగో పోర్ట్‌ఫోలియోలో ఈ వేరియెంట్ NRGని మరింత బలోపేతం చేస్తుందని, అమ్మకాలు పెరుగుతాయని టాటామోటార్స్ అంచనా వేస్తుంది.

ఇక సేఫ్టీ విభాగంలో టాటా మోటార్స్ కార్లు చక్కటి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాయి. ఈ మోడల్ కూడా గ్లోబల్ NCAP ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ప్రస్తుతం దేశీయ విపణిలో టియాగో పెట్రోల్ వెర్షన్ మొత్తం అమ్మకాలలో టియాగో ఎన్‌ఆర్‌జి వాటా 15 శాతానికి చేరుకుంది.

First published:

Tags: Auto News, New cars, Tata, Tata cars

ఉత్తమ కథలు