మీరు టాటా స్కై కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా ఇప్పుడున్న సెట్ టాప్ బాక్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం. కొత్త హెచ్డీ సెట్-టాప్ బాక్స్ తీసుకున్నవారికి 'అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్' అందిస్తోంది టాటాస్కై. అంటే మీరు సెట్-టాప్ బాక్స్ తీసుకుంటే రూ.3,999 విలువైన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితంగా లభిస్తుంది. ఒక్కరూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టాటాస్కై కనెక్షన్ ఉన్నవారు హెచ్డీ సెట్-టాప్ బాక్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నా ఈ ఆఫర్ పొందొచ్చు. కొత్త కనెక్షన్ ప్రారంభ ధర రూ.1,499 నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఎంచుకునే ఛానెల్ ప్యాకేజీని బట్టి ఇది మారొచ్చు. మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత హెచ్డీ సెట్-టాప్ బాక్స్‌తో పాటు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉపయోగించుకోవచ్చు. గతంలో 'టాటా స్కై బింజ్' సర్వీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
'అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్'ను మీ టీవీలోని హెచ్డీఎంఐ పోర్ట్‌కు, మీ ఇంట్లోని వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి. సెట్-టాప్ బాక్స్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లో అమెజాన్ ప్రైమ్‌తో పాటు హాట్‌స్టార్, జీ5, ఎరోస్ నౌ లాంటి స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయి. వాటి సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే వీటికి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్-టాప్ బాక్స్ అవసరం లేదంటే టాటా స్కై బింజ్ సర్వీస్ తీసుకోవచ్చు. నెలకు రూ.249 చెల్లిస్తే చాలు హాట్‌స్టార్, ఎరోస్ నౌ, జీ5, హంగామా ప్లే, సన్ నెక్స్ట్ లాంటి సర్వీసుల్ని పొందొచ్చు.
మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?
ఇవి కూడా చదవండి:
Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?
SBI FASTag: డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్బీఐలో కొనండి ఇలా
Reliance Jio: రిలయెన్స్ జియో జోరు... ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా విలవిల
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.