Home /News /technology /

TATA SKY LAUNCHES TATA SKY BINGE OTT SERVICE FOR MOBILE DEVICES KNOW ABOUT PLANS SS GH

Tata Sky Binge: ఇక ఫోన్లలోనూ టాటా స్కై బింజ్​... యాప్ విడుదల చేసిన ఓటీటీ ప్లాట్‌ఫాం

Tata Sky Binge: ఇక ఫోన్లలోనూ టాటా స్కై బింజ్​... యాప్ విడుదల చేసిన ఓటీటీ ప్లాట్‌ఫాం
(image: Tata Sky Binge)

Tata Sky Binge: ఇక ఫోన్లలోనూ టాటా స్కై బింజ్​... యాప్ విడుదల చేసిన ఓటీటీ ప్లాట్‌ఫాం (image: Tata Sky Binge)

Tata Sky Binge | టాటా స్కై బింజ్ పేరుతో ఓటీటీ సర్వీస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సర్వీస్ మొబైల్ డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చింది. ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

వివిధ ఓవర్​ ది టాప్​ (ఓటీటీ) సర్వీస్​లను ఇంతకాలం టీవీలకే అందించిన టాటా స్కై బింజ్ ఇక మొబైల్ ఫోన్లలోనూ వాడుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్​, ఐ ఫోన్లకు యాప్​లను విడుదల చేసింది. బింజ్​లో పెయిడ్ సర్వీసెస్​కు సబ్​స్రైబ్​ చేసుకుంటే డిస్నీ+ హాట్​స్టార్​, ఎరోస్ నౌ, వూట్ సెలక్షన్​, సోనీ లివ్​ సహా మొత్తం 10 ఓటీటీ ప్లాట్​ఫామ్​లను వాడుకోవచ్చు. మొబైల్ కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా బింజ్​ నెలకు రూ.149లకే ప్లాన్ తీసుకొచ్చింది. ఒకవేళ మొబైల్​తో పాటు టీవీల్లోనూ ఈ టాటా స్కై బింజ్​ను వాడాలంటే నెలకు రూ.299 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. టాటా స్కై బింజ్ యాప్​ గూగుల్ ప్లేస్టోర్​, యాప్ స్టోర్​లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను టాటా స్కై సబ్​స్రైబర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

మొబైల్ నంబర్​ లేదా టాటా స్కై సబ్​స్రైబర్ ఐడీ ద్వారా లాగిన్ అయి బింజ్ సర్వీస్​లను వాడుకోవచ్చు. టాటా స్కై బింజ్​లో లాగిన్ అయ్యాక మొబైల్ డివైజెస్​లో యూజర్లు ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లను ఉపయోగించుకోవచ్చు. వివిధ స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి షోలు, కొన్ని వెబ్​ సిరీస్​లు, పాపులర్ సినిమాలు, ట్రెండింగ్​లో ఉన్న వీడియోలు చూడవచ్చు. అలాగే భాష, జానర్​ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వివిధ ఓటీటీల్లోనూ కంటెంట్​ను ఒకే దగ్గర సెర్చ్ చేసే ఫీచర్ కూడా టాటా స్కై బింజ్​లో ఉంది. అలాగే వాయిస్ సెర్చ్ కూడా ఉంది.

Redmi Note 10 Series: రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్లు... వీటిలో ఏది బెస్ట్?

Nokia Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన నోకియా... లేటెస్ట్ రేట్స్ ఇవే

రూ.149 మొబైల్ ఓన్లీ ప్లాన్​ను తీసుకుంటే బింజ్ యూజర్లు డిస్నీ+ ప్లస్​హాట్ స్టార్​, ఎరోస్ నౌ, హంగామా ప్లే, షెమారో, సోనీ లివ్​, వూట్ కిడ్స్​, వూట్ సెలెక్ట్​, జీ5 ఓటీటీ యాప్​లను వాడుకోవచ్చు. ఇది ఏడు రోజుల ఫ్రీ ట్రయల్​తో వస్తోంది. ఒకవేళ మొబైల్​తో పాటు టీవీలోనూ వాడుకోవాలంటే రూ.299 ప్లాన్​ను ఎంపిక చేసుకోవచ్చు. 2019లో అమెజాన్ భాగస్వామ్యంతో టాటా స్కై బింజ్ సర్వీస్​ను తీసుకొచ్చింది. అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా టాటా స్కై సబ్​స్రైబర్లు మాత్రమే ఈ సర్వీస్​ను పొందే అవకాశం ఉండేది. ఆ తర్వాత టాటా స్కై సొంతంగా బింజ్​+ పేరుతో ఆండ్రాయిడ్ సెటాప్ బాక్సులను తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఫోన్లలోనూ వాడుకునేందుకు యాప్స్​ను ప్రారంభించింది.

Mi 11 Ultra: ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూడాల్సిందే... సేల్ మరింత ఆలస్యం

Android 12 New Features: మీది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనా? ఈ 12 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

ఒకే సబ్​స్క్రిప్షన్ ద్వారా అనేక ఓటీటీ ప్లాట్​ఫామ్​లు వాడుకునే సదుపాయం ఉండడంతో ఇది హిట్టవుతుందని టాటా స్కై నమ్మకంతో ఉంది. అయితే ప్రస్తుతం బింజ్​లో అమెజాన్ ప్రైమ్ ఆప్షన్ ఉన్నా.. వేరుగా అమెజాన్ ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్ ఉంటేనే ఆ​ వివరాలతో లాగిన్​ కావాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Ott, Tata Sky

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు