• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • TATA SKY HD SET TOP BOX AND TATA SKY BINGE BUNDLE FOR RS 4999 WITH 6 MONTHS FREE SUBSCRIPTION SS

JIO effect: టాటా స్కై సెట్-టాప్-బాక్స్‌తో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితం

JIO effect: టాటా స్కై సెట్-టాప్-బాక్స్‌తో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితం

Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky | రూ.4,999 చెల్లించి టాటా స్కై సెట్-టాప్-బాక్స్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తీసుకున్నవాళ్లు ఛానెల్ ప్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఛార్జీలు ఉంటాయి.

  • Share this:
    రిలయెన్స్ జియోఫైబర్ లాంఛింగ్‌కు గడువు ముంచుకొచ్చేస్తుండటంతో పోటీ కంపెనీల్లో దడపుడుతోంది. కస్టమర్లను కాపాడుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డీటీహెచ్ ఆపరేటర్ టాటా స్కై సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. ఇటీవల సెటాప్ బాక్సుల ధరల్ని తగ్గించడంతో పాటు ఫ్లెక్సీ ప్లాన్‌కు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు టాటా స్కై హెచ్‌డీ సెట్-టాప్-బాక్స్‌తో పాటు టాటాస్కై బింజ్ బండిల్ కలిపి రూ.4,999 ధరకే అందించనుందన్న వార్తలొస్తున్నాయి. రూ.4,999 చెల్లించిన వారికి రూ.1,499 విలువైన హెచ్‌‌డీ సెట్-టాప్-బాక్స్‌ ఉచితంగా లభిస్తుంది. రూ.2,499 అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. దాంతోపాటు రూ.1,494 విలువైన ఆరు నెలల టాటా స్కై బింజ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంట్లోనే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉంటుంది.

    Tata Sky HD set-top-box, Tata Sky Binge, Tata Sky new offers, tata sky new packages, tata sky recharge offers, tata sky plans and packages, టాటా స్కై హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్, టాటా స్కై బింజ్, టాటా స్కై కొత్త ఆఫర్స్, టాటా స్కై కొత్త ప్యాకేజీ, టాటా స్కై రీఛార్జ్ ఆఫర్స్, టాటా స్కై ప్లాన్స్
    image: Amazon India


    రూ.4,999 చెల్లించి టాటా స్కై సెట్-టాప్-బాక్స్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తీసుకున్నవాళ్లు ఛానెల్ ప్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఛార్జీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎంచుకున్న ఛానెళ్లకు రూ.250 ఛార్జీలు అయ్యాయనుకుంటే మీ బ్యాలెన్స్‌లో ఉన్న రూ.2,499 నుంచి ప్రతీ నెలా డిడక్ట్ అవుతుంది. ఇక టాటా స్కై బింజ్ సర్వీస్‌లో 3 నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దాంతో పాటు హాట్‌స్టార్, ఎరాస్ నౌ, సన్‌ నెక్స్ట్‌, హంగామా ప్లే కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ఆల్ట్ బాలాజీ, జీ5, నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్ చూడాలంటే డబ్బులు చెల్లించాలి. ఆరు నెలల తర్వాత టాటా స్కై బింజ్ ఫ్రీ సర్వీస్ పూర్తవుతుంది. ఆ తర్వాత నెలకు రూ.249 చెల్లించాలి.

    Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Good News: క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త సదుపాయం... ఇక పేమెంట్స్ ఈజీ

    IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే

    Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారికి ఆర్‌బీఐ శుభవార్త
    First published: