హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tata Sky: 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Tata Sky: 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Tata Sky: 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky: 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky Broadband 200 Mbps Plan | టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సంస్థ కొత్త ఇంటర్నెట్ ప్లాన్ ప్రకటించింది. 200ఎంబీపీఎస్ స్పీడ్‌ డేటా ఉపయోగించొచ్చు.

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగింది. దీంతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించే సంస్థలు కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. టాటా స్కై లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సంస్థ 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రకటించింది. ఇది అన్‌లిమిటెడ్ ప్లాన్. ధర నెలకు రూ.1050. దేశంలోని 14 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందిస్తోంది. ఈ నగరాల్లో అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ని పునరుద్ధరిస్తోంది. యూజర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు ల్యాండ్‌లైన్ సేవల్ని కూడా అందిస్తోంది. ఇప్పుడు టాటా స్కై 200ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో, సాంకేతికంగా సాధ్యమయ్యే ఏరియాల్లోనే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని టాటాస్కై వెల్లడించింది.

JioFiber: జియోఫైబర్ ఉచితంగా ట్రై చేయండి... అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కూడా ఫ్రీ

SBI ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? అకౌంట్‌లో డెబిట్ అయ్యాయా? ఇలా చేయండి

టాటాస్కై 200ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్నవారు నెలకు రూ.1050 చెల్లించాలి. నెలలో 3300జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత స్పీడ్ 200ఎంబీపీఎస్ నుంచి 3ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఒక నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. నెలవారీగా ఈ ప్లాన్ ఎంచుకుంటే రూ.500 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలతో పాటు రూ.1000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. క్వార్టర్లీ, సెమీ-యాన్యువల్, యాన్యువల్ ప్లాన్స్ తీసుకున్నవారు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈ ప్లాన్ నెలకు, మూడు నెలలకు తీసుకున్నవాళ్లు రూ.100 అదనంగా చెల్లించి ల్యాండ్‌లైన్ సర్వీసులు పొందొచ్చు. సెమీ-యాన్యువల్, యాన్యువల్ ప్యాక్స్ తీసుకున్న వారికి ల్యాండ్ లైన్ సేవలు ఉచితం. ఇక టాటాస్కై 300ఎంబీపీఎస్ ప్లాన్‌ను సవరించింది టాటాస్కై. ఈ ప్లాన్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. నెలకు రూ.1500 చెల్లించాలి.

Realme Narzo 20A: తక్కువ ధరలో ఫోన్ కావాలా? కాసేపట్లో రియల్‌మీ నార్జో 20ఏ సేల్

Motorola E7 Plus: ఈరోజే మోటోరోలా ఈ7 ప్లస్ సేల్... యాక్సిస్, ఐసీఐసీఐ కార్డులపై ఆఫర్స్

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, పిల్లల ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునేవారికి బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు పోటాపోటీగా ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జియోఫైబర్ 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో సరికొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు.

First published:

Tags: Internet, Tata Sky

ఉత్తమ కథలు