గతంలో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు టాటా ప్లే ఫైబర్ (Tata Play Fiber) పేరుతో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు... టాటా స్కై పేరుతో ఉన్న అన్ని సేవలు ఇకపై టాటా ప్లే పేరుతో లభిస్తాయి. కస్టమర్లకు రూ.1150 విలువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను (Broadband Plan) ఉచితంగా అందిస్తోంది టాటా ప్లే ఫైబర్. ఒక నెల పాటు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని పొందొచ్చు. ట్రై అండ్ బయ్ స్కీమ్‌లో భాగంగా టాటా ప్లే ఈ ఆఫర్ అందిస్తోంది. కొత్తగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారు టాటా ప్లే ఫైబర్ ప్లాన్ ట్రై చేయొచ్చు. నెల రోజుల పాటు ఇంటర్నెట్ వాడుకున్న తర్వాత సేవలు నచ్చితే కనెక్షన్ కొనసాగించొచ్చు. ఇప్పటికే ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా ఇలాంటి ఆఫర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాటా ప్లే ఫైబర్ కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోయింది. మరోవైపు ఆన్‌లైన్ క్లాసులు కూడా ఉండటంతో ఇళ్లల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం సాధారణం అయిపోయింది. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవడానికి బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు చాలా ఆఫర్స్ ఇస్తున్నాయి. మార్కెట్ షేర్ పెంచుకోవడం కోసం చూస్తున్నాయి. ఇప్పుడు టాటా ప్లే ఫైబర్ కూడా ఫ్రీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో కస్టమర్లు ఒక నెల ఉచితంగా ఫైబర్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
Oppo Reno 7 Pro: ఒప్పో రెనో 7 ప్రో సేల్ ప్రారంభం... రూ.4,000 డిస్కౌంట్
టాటా ప్లే ఫైబర్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్లాన్ లభిస్తుంది. మొత్తం 1000జీబీ డేటా వాడుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు రూ.1500 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. టాటా ప్లే ఫైబర్ ఈ ప్లాన్‌లో భాగంగా ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. ఒకవేళ యూజర్ 30 రోజుల్లో సర్వీస్ క్యాన్సిల్ చేస్తే రూ.500 సర్వీస్ ఛార్జీ మినహాయించి రూ.1,000 రీఫండ్ ఇస్తారు. సరిగ్గా 30వ రోజు లేదా అంతకన్నా ముందే కనెక్షన్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కస్టమర్లకు రీఫండ్ లభిస్తుంది.
iPhone: రూ.1,50,000 విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే... పార్శిల్‌లో వచ్చిన వస్తువు చూసి ఆమె షాకైంది
టాటా ప్లే ఫైబర్ సేవలు నచ్చితే కనెక్షన్ కొనసాగించొచ్చు. వారికి అనేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 100ఎంబీపీఎస్ ప్లాన్ మూడు నెలలకు ఎంచుకుంటే రూ.1500 రీఫండ్ పూర్తిగా పొందొచ్చు. ఇందులో రూ.500 రీఫండ్, రూ.1000 సెక్యూరిటీ డిపాజిట్ వ్యాలెట్‌లో ఉంటుంది. మంత్లీ ప్లాన్ ఎంచుకుంటే రూ.1000 రీఫండ్ మూడు నెలల తర్వాత వస్తుంది. రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ వ్యాలెట్‌లో ఉంటుంది.
టాటా ప్లే ఫైబర్ ఉచిత కనెక్షన్ ఆఫర్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఉచిత కనెక్షన్ పొందేముందు నియమనిబంధనలన్నీ తెలుసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.