హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tata Play Binge+: తక్కువ ధరకే డీటీహెచ్, ఓటీటీ సర్వీసులు.. మామూలు టీవీలోనే ప్రైమ్, యూట్యూబ్, హాట్‌స్టార్ చూడొచ్చు!

Tata Play Binge+: తక్కువ ధరకే డీటీహెచ్, ఓటీటీ సర్వీసులు.. మామూలు టీవీలోనే ప్రైమ్, యూట్యూబ్, హాట్‌స్టార్ చూడొచ్చు!

Tata Play Binge+: అందుబాటు ధరకే డీటీహెచ్, ఓటీటీ సర్వీసులు.. మామూలు టీవీలో ప్రైమ్, యూట్యూబ్, హాట్‌స్టార్ చూసేయండిలా!

Tata Play Binge+: అందుబాటు ధరకే డీటీహెచ్, ఓటీటీ సర్వీసులు.. మామూలు టీవీలో ప్రైమ్, యూట్యూబ్, హాట్‌స్టార్ చూసేయండిలా!

OTT | మీరు కొత్తగా డీటీహెచ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? అయితే మీరు టాటా ప్లే బింగ్ ప్లస్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీని ద్వారా టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రెండూ చూడొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

DTH | మీరు కొత్తగా డీటీహెచ్ కనెక్షన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న సాధారణ టీవీ అయితే మీరు టాటా ప్లే బింగ్ ప్లస్ బాక్స్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ సెటప్ బాక్స్ ద్వారా మీరు మీ మామూలు టీవీలో అమెజాన్ ప్రైమ్ (Prime), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Hotstar), జీ5 వంటి పలు రకాల ఓటీటీ సర్వీసులు పొందొచ్చు. మీది స్మార్ట్ టీవీ కానక్కర్లేదు. అయినా కూడా మీ టీవీలో ఈ యాప్స్‌ను వీక్షించొచ్చు.

అందుకే కొత్త టీడీహెచ్ కనెక్షన్ పొందే వారు ఈ బాక్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇంకా నెట్‌ఫ్లిక్స్ కూడా చూడొచ్చు. ఇది స్మార్ట్ సెటప్ బాక్స్. ఇది గూగుల్ సెటప్ బాక్స్. అంటే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా మీరు టీవీని చూడొచ్చు. దేశీ అతిపెద్ద డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్‌గా కొనసాగుతూ వస్తున్న టాటా ప్లే నుంచి వస్తున్న ఒకే ఒక స్మార్ట్ ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఇది.

రూ.40,000 స్మార్ట్‌టీవీ కేవలం రూ.13 వేలకే..

మీరు ఈ స్మార్ట్ సెటప్ బాక్స్‌కు మీ టీవీకి కనెక్ట్ చేస్తే.. అందులో మీరు టీవీ చానల్స్‌తో పాటుగా ఓటీటీ కంటెంట్ కూడా పొందొచ్చు. మీరు స్మార్ట్ టీవీ కావొచ్చు.. కాకపోవచ్చు.. మీరు ఈ ఓటీటీ సేవలు మీ టీవీలో చూడొచ్చు. అందువల్ల సాధారణ టీవీ కలిగిన వారు సెటప్ బాక్స్‌ను ఎంచుకోవచ్చు. ప్రైమ్, జీ5, వూట్, నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిని చూడొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి.

రూ.15 వేల డిస్కౌంట్, ఉచితంగా రూ.5 వేల స్పీకర్.. స్మార్ట్‌టీవీ కొనే వారికి బంపరాఫర్లు!

ఈ టాటా ప్లే బింగ్ ప్లస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ధర రూ. 2199 గా ఉంది. అయితే మీరు ఆన్‌లైన్‌లోనే సెటప్ బాక్స్‌ను కొనుగోలు చేస్తే.. అప్పుడు మీకు రూ. 200 డిస్కౌంట్ వస్తుంది. దీనికి టీపీఎల్ 200 అనే ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అంటే అప్పుడు మీకు రూ.2 వేలకే ఈ సెటప్ బాక్స్ వచ్చినట్లు అవుతుంది. అయితే దీనికి మీరు మళ్లీ నెల రోజుల ప్యాక్ వేసుకోవాలి. దీనికి కనీసం రూ. 270 అవుతుంది. అంటే అప్పుడు మీకు రూ. 2,270కు కొత్త కనెక్షన్ వస్తుంది. ఒక నెల పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. తర్వాతి నెల నుంచి ఓటీటీ సేవల ధర రూ. 99 నుంచి ప్రారంభం అవుతోంది. ఆన్‌లైన్‌లో టాటా ప్లే బింగ్ ప్లస్ కనెక్షన్ కోసం డబ్బుల చెల్లించిన తర్వాత 2 నుంచి మూడు రోజుల్లో మీకు కనెక్షన్ సెట్ చేస్తారు.

First published:

Tags: DTH, Ott, Ott platform, Tata Play, Tata Sky

ఉత్తమ కథలు