హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tata Tigor: టాటా మోటార్స్ నుంచి అదిరిపోయే కారు లాంఛ్ .. ధర, ఫీచర్స్ వేరే లెవెల్ అంతే !

Tata Tigor: టాటా మోటార్స్ నుంచి అదిరిపోయే కారు లాంఛ్ .. ధర, ఫీచర్స్ వేరే లెవెల్ అంతే !

 టాటా మోటార్స్ నుంచి అదిరిపోయే కారు లాంఛ్ .. ధర, ఫీచర్స్  వేరే లెవెల్  అంతే  !

టాటా మోటార్స్ నుంచి అదిరిపోయే కారు లాంఛ్ .. ధర, ఫీచర్స్ వేరే లెవెల్ అంతే !

టాటా మోటార్స్(Tata Motors) నుంచి మరో కొత్త కారు(Car) ఇండియాలో రిలీజ్ అయింది. ఈసారి కంపెనీ సీఎన్‌జీ(CNG) వెహికల్‌ను విడుదల చేసింది. దాని పేరు టాటా టిగోర్ XM iCNG (Tata Tigor XM iCNG). భారత మార్కెట్‌లో దీని ధర రూ. 7.39 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా(India)లో కార్ల తయారీ సంస్థలు ఎన్ని ఉన్నా, లోకల్ బ్రాండ్ టాటా(Tata) మోటార్స్ నుంచి వచ్చే వెహికల్స్‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కొత్తగా కారు(Car) కొనాలనుకునే ప్రతి కస్టమర్, టాటా కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్స్ గురించి ఆరా తీస్తారు. అమ్మకాల్లోనూ ఈ బ్రాండ్ టాప్ లెవల్‌లో ఉంటుంది. అయితే తాజాగా టాటా మోటార్స్ నుంచి మరో కొత్త కారు ఇండియాలో రిలీజ్ అయింది. ఈసారి కంపెనీ సీఎన్‌జీ వెహికల్‌ను విడుదల చేసింది. దాని పేరు టాటా టిగోర్ XM iCNG (Tata Tigor XM iCNG). భారత మార్కెట్‌లో దీని ధర రూ. 7.39 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.

ఈ బ్రాండ్ టిగోర్ iCNG రేంజ్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. టాటా టిగోర్ XM iCNG అనేది సెడాన్ CNG సిరీస్‌లో ఎటువంటి మెకానికల్ అప్‌డేట్ లేకుండా వచ్చిన కొత్త బేస్ వేరియంట్. టిగోర్ XM iCNGలో 4 స్పీకర్లతో కూడిన హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్(Windows), సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది ఒపాల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ, డీప్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కొత్త వెహికల్ లాంచ్‌ గురించి మాట్లాడారు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ. టిగోర్ సిరీస్ కంపెనీకి చాలా ప్రత్యేకమైన ప్రొడక్ట్ అని చెప్పారు. కొత్త ఐసీఎన్‌జీ వేరియంట్‌తో ఈ విభాగంలో ప్రొడక్ట్ లైనప్‌ ఊపందుకుందన్నారు. ప్రస్తుతం టిగోర్ బుకింగ్స్‌లో 75% కంటే ఎక్కువ iCNG వేరియంట్ నుంచి వస్తున్నాయని, ఇది టిగోర్ పోర్ట్‌ఫోలియోలో కొత్త టెక్నాలజీకి బలమైన డిమాండ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !


 ‘టిగోర్ iCNGకి ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో బ్రాండ్ ఫిలాసఫీకి అనుగుణంగా కొత్త Tigor XM iCNGని రూపొందించాం. మా iCNG టెక్నాలజీని ఎంట్రీ లెవల్ ట్రిమ్‌తో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే కొత్త కస్టమర్ల కోసం ఈ మోడల్‌ను డిజైన్ చేశాం. ఈ కొత్త ఎడిషన్‌.. ఈ విభాగంతో పాటు CNG స్పేస్‌లో మా వృద్ధిని మరింత పెంచుతుందని భావిస్తున్నాం’ అని రాజన్ అంబ తెలిపారు.

టాటా టిగోర్ అనేది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండో సెడాన్. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో దీనికి 21 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో.. పెట్రోల్, సీఎన్‌జీ, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న ఏకైక సెడాన్ టాటా టిగోర్.

First published:

Tags: CNG, Petrol, Ratan Tata, Tata Motors

ఉత్తమ కథలు