హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tata Motors: టాటా ఎలక్ట్రిక్‌ SUVలలో ఫోర్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ.. కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్‌ ఇదే..

Tata Motors: టాటా ఎలక్ట్రిక్‌ SUVలలో ఫోర్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ.. కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్‌ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టాటా మోటార్స్‌ తాజాగా మరో అప్‌డేట్‌ను ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ ఫోర్‌-వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీ(Electric Four Wheel Drive Technology)ని పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది. టాటా మోటార్స్‌ ఈవీ సెగ్మెంట్‌లో తీసుకొస్తున్న మార్పులు ఏంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియాలో ఎలక్ట్రిక్‌ వాహనాల(EV)కు డిమాండ్‌ పెరుగుతోంది. ఆటో రంగంలో దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయి. కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈవీ మార్కెట్‌పై స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. అత్యధికంగా ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయిస్తూ రికార్డులు నెలకొల్పుతోంది. అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్‌ కార్‌ను లాంచ్‌ చేసి మార్కెట్‌ను ఆకర్షించింది. ఇప్పటికే ఈవీ జర్నీని ప్రకటించిన టాటా మోటార్స్‌ తాజాగా మరో అప్‌డేట్‌ను ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ ఫోర్‌-వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీ(Electric Four Wheel Drive Technology)ని పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది. టాటా మోటార్స్‌ ఈవీ సెగ్మెంట్‌లో తీసుకొస్తున్న మార్పులు ఏంటో తెలుసుకుందాం.

ఈవీలలో ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీల్‌ టెక్నాలజీ

టాటా మోటార్స్ తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో ఫోర్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ విషయాన్ని కంపెనీ టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్- ప్యాసింజర్ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ శైలేష్ చంద్ర చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను అప్‌గ్రేడ్‌ చేయడంపై తమ దృష్టి ఉంటుందని, ఫ్యూచర్ ఎస్‌యూవీల ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఈ టెక్నాలజీని అందించబోతున్నామని పేర్కొన్నారు. ఈ ఆటో మేజర్ ప్రస్తుతం నెక్సాన్, హారియర్, సఫారి వంటి మోడల్స్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ట్రిమ్‌లను అందించలేదు.

రూ.15,000 కోట్ల పెట్టుబడులు

టాటా వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగంలో రూ.15,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ మొత్తాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని పెంచడానికి, మార్కెట్లో కొత్త ప్రొడక్టులను లాంచ్‌ చేయడానికి ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి ప్రస్తుతం ఉన్న వాటితో కలిపి మొత్తం పది ఎలక్ట్రిక్ ప్రొడక్టులను లాంచ్‌ చేయాలని టాటా మోటార్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్ ఫోర్-బై-ఫోర్ (4X4) అప్‌గ్రేడ్ కోసం సాధ్యమైన వాటిగా నెక్సాన్ శ్రేణికి ఎగువన ఉన్న మోడల్స్‌ను పరిశీలిస్తోంది.

అతి తక్కువ ధరకే ఈవీ కార్‌

ఇటీవల టాటా మోటార్స్ అత్యంత తక్కువ ధరకే ఈవీ కార్‌ను లాంచ్‌ చేసింది. రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్‌ కోసం బుకింగ్స్‌ 2022 అక్టోబర్ 10 మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. రూ.21,000కి కార్‌ బుక్‌ చేసుకోవచ్చని శుక్రవారం కంపెనీ ప్రకటించింది. మొదటి 10,000 కస్టమర్లకు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, వీటిలో 2,000 నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ప్రస్తుత యజమానులకు రిజర్వేషన్‌ ఉంటుందని స్పష్టం చేసింది. జనవరి 2023లో డెలివరీలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ చివరి నాటికి ఈవీ టెస్ట్ డ్రైవ్‌లు మొదలవుతాయని వెల్లడించింది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Electric cars, Tata Motors

ఉత్తమ కథలు